మహేష్ చేతిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ నే కాకుండా ఇతర భాషలలో కూడా ఫాన్ ఫాలోయింగ్ భారీగానే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మహేష్ బాబు అందాన్ని చూస్తే ఎంతటి వారైనా సరే ఈర్షపడకుండా ఉండలేరు. నాలుగు పదుల వయసులో కూడా మహేష్ బాబు పాతికేర్ల కుర్రాడు లా కనిపిస్తూ ఉన్నారు. మహేష్ తో నటించిన హీరోయిన్స్ చాలామందిని ఇప్పుడూ ఆయన పక్కన అసలు ఊహించుకోలేరని చెప్పవచ్చు. మహేష్ సినిమాలో చైల్డ్ యాక్టర్ గా చేసిన వారు ఇప్పుడు హీరోయిన్స్ గా కూడా మారిపోయారు. ఇప్పుడు మహేష్ బాబు చేతిలో ఉన్న ఈ చిన్నారి ఎవరు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మహేష్ బాబు చేతిలో ఉన్న ఈ అమ్మడు శ్రీదివ్య. ఈ ముద్దుగుమ్మ తెలుగులో తక్కువ చిత్రాలలో మాత్రమే నటించి బాగానే పాపులర్ అయింది. తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తు బిజీ హీరోయిన్గా మారిపోయింది. మొదట తెలుగు ఇండస్ట్రీ లోకి నటుడు రవిబాబు దర్శకత్వంలో వచ్చిన మనసారా అనే చిత్రంతో హీరోయిన్గా తెలుగుతరకు పరిచయమయ్యింది.తన మొదటి సినిమాతోనే అచ్చ తెలుగు అమ్మాయిల పేరు పొందింది శ్రీదివ్య.

Sri Divya | Yuvaraju | Kollywood stars who started off as child artistsఆ తరువాత బస్ స్టాప్ , కేరింత వంటి సినిమాలలో నటించింది.ఇక అంతే కాకుండా తమిళ్లో స్టార్ హీరోలైన కార్తీ, విశాల్ వంటి హీరోలతో కూడా నటించింది ముద్దుగుమ్మ. శ్రీదివ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో చిత్రాలలో నటించింది.మహేష్ బాబు నటించిన యువరాజు చిత్రంలో శ్రీ దివ్య చిన్న పాత్రలో కనిపించి బాగా ఆకట్టుకుంది ఇప్పుడు ఆ చిత్రంలోని ఫోటో వైరల్ గా మారుతొంది. ఇక ఈ ఫోటో పైన మహేష్ అభిమానులు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారుతోంది.