కొరటాల శివ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా..హీరోయిన్స్ కూడా పనికిరారు..!

టాలీవుడ్ లో ఎందరో గొప్ప డైరెక్టర్లు ఉన్నారు. వారిలో కొరటాల శివ కూడా ఒకరు. ముందుగా రైటర్‌గా తన కెరియర్ను ప్రారంభించిన కొరటాల శివ డైరెక్టర్ కమ్‌ యాక్టర్ అయినా పోసాని కృష్ణ మురళి వ‌ద్ద‌ పనిచేసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల‌కు కథలు మాటలు అందించాడు. సినిమా విజయం సాధించడంలో కథే ముఖ్యమని నమ్మిన కొరటాల రచయిత కన్నా డైరెక్టర్ కి ఎక్కువ పేరు వస్తుందని తాను కూడా డైరెక్టర్ గా మారి మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి టాలీవుడ్ లోనే స్టార్ దర్శకుడు గా పేరు తెచ్చుకున్నాడు.

I may have to retire after five years: Koratala Siva | Telugu Movie News -  Times of India

ఇక కొరటాల మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఆచార్య సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా మినహా ఆయన చేసిన మిగిలిన సినిమాలు అన్నీ టాలీవుడ్ లోనే సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేశాయి. ప్రస్తుతం కొరటాల ఎన్టీఆర్ తో చేయబోయే తన సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. కొరటాల టాలీవుడ్ లో ఇంత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎదగడానికి ప్రధాన కారణం ఆయన భార్య అని ఎన్నో సందర్భాల్లో కొరటాల చెప్పాడు.

ఇక ఇప్పుడు కొరటాల భార్యకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొరటాల భార్య పేరు అరవింద ఆమె ఎంతో సింపుల్ గా ఉంటారు. లండన్ లో చదువుకున్న ఈమె కొరటాల సింప్లిసిటీ చూసి ఆయనను ప్రేమించి వివాహం చేసుకున్నారట. ఇక వీరికి పెళ్లి చేసుకుని ఇంత కాలం అయిన‌ ఇప్పటికీ పిల్లలు మాత్రం లేరు. ఈ విషయం గురించి కొరటాల పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. కొరటాల భార్య పిల్లలు లేరని బాధపడకుండా సమాజంలో ఉన్న పిల్లలందరూ తమ పిల్లలని భావనతో వారు తమ లైప్‌ని ఎంతో హ్యాపీగా కొనసాగిస్తున్నారు.

ఇక ఈమె అంతే కాకుండా రామకృష్ణ పరమహంస భక్తురాలు. ఖాళీ సమయం వచ్చినప్పుడల్లా హైదరాబాదులోని రామకృష్ణ మఠంకు వెళ్లి అక్కడున్నవారికి ఎంతో సేవ చేస్తుందట. కొరటాల శివ మహేష్ బాబు కాంబోలో వచ్చిన శ్రీమంతుడు సినిమా కథకు మూల కారణం కొరటాల భార్యేనట. తాను ఎంత సంపాదించుకున్న అవసరానికి మించి ఉండకూడదనే భావనతో ఉంటుండట. మనం జీవించడానికి అవసరమైన డబ్బు ఉంచుకొని మిగిలింది అంతా సమాజంలో ఏమైనా మంచి పనులకు ఖర్చు పెడుతుందట. ఎందరో అనాధ పిల్లలను చదివిస్తూ తన ఉదారతను చాటుకుంటోన్న గొప్ప మ‌న‌సున్న మ‌నిషి అర‌వింద అని చెప్పాలి.

Share post:

Latest