తోడేలు సినిమా టాక్ ఎలా ఉందో తెలుసా..?

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కృతి సనన్ హీరోయిన్గా నటించిన చిత్రం భేదియా. ఈ చిత్రం హర్రర్ కామెడీ గా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగులో తోడేలు అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్గా విడుదలయ్యింది.ఈ సినిమా విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్ తన బ్యానర్ మీద విడుదల చేశారు. దీంతో మరొకసారి అందరి దృష్టి ఈ సినిమా పైన పడింది.

Thodelu Movie OTT Release Date, OTT Platform, Time, and more - Telugu Aceఇక గతంలో కాంతార చిత్రాన్ని కూడా తెలుగులో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు అల్లు అరవింద్.అందుచేతనే ఇప్పుడు తోడేలు సినిమా పైన కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి.తోడేలు సినిమాకి అమీర్ కౌశిక్ దర్శకత్వం వహించారు.ఆల్రెడీ ఈ చిత్రం ప్రీమియర్స్ విడుదలయ్యాయి సినిమా చూసిన వాళ్లు కూడా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వారి టాక్ ప్రకారం ఈ చిత్రం పిల్లలను పెద్దలను కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వరుణ్ ధావన్, నటన కృతి సనన్ గ్లామర్ ఈ చిత్రానికి త్రీడీ ఎఫెక్ట్ ఇలా అన్ని కలిసి రావడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందించినట్లుగా తెలుస్తోంది. కచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమాగా ఉందని ప్రేక్షకులు తమ ట్విట్టర్ నుంచి తెలియజేస్తున్నారు. ఇందులో కృతి సనన్ నటన కూడా చాలా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పిల్లలకు పెద్దలను కూడా భయపెట్టే విధంగా ఈ సినిమా ఉందని కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి.

https://twitter.com/atheistwords/status/1595966708849967104?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1595966708849967104%7Ctwgr%5Ea7305a2f4d889c27de933da274a434f81178700a%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.filmyfocus.com%2Fhodelu-movie-twitter-review%2F