రూ.1000 కోట్లతో ఆ హీరోతో డైరెక్టర్ శంకర్ చిత్రం..!!

ప్రస్తుత కాలంలో ఎక్కువగా పలు చారిత్రాత్మక చిత్రాల ట్రెండ్ బాగానే నడుస్తొందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలు ఎన్నో విడుదలై పలు రికార్డులను సైతం సృష్టించాయి. ముఖ్యంగా బాహుబలి, RRR వంటి చిత్రాలతో వీటికి క్రేజ్ రాగా.. పొన్నియన్ సెల్వన్ చిత్రం మరొక చారిత్రాత్మక కథ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు సక్సెస్ అయ్యాయి. అయితే ఇలాంటి చిత్రాలు తెరకెక్కించడానికి ముఖ్య స్ఫూర్తి రాజమౌళిని నే అని డైరెక్టర్ మణిరత్నం ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.

Suriya and Shankar to do a film based on the novel Velpari | Tamil Movie  News - Times of India

ఇప్పుడు ఈ దర్శకుల బాటలోనే మరొక డైరెక్టర్ వెల్లబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు డైరెక్టర్ శంకర్. విభిన్నమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఎప్పుడు నిలుస్తూ ఉంటారు డైరెక్టర్ శంకర్. ఈయన తెరకెక్కించే సినిమాలు ఎక్కువగా భారీ బడ్జెట్ తో ఉండడమే కాకుండా కచ్చితంగా విజయాన్ని అందుకుంటూ ఉంటాయని అభిమానులు నమ్మకాన్ని తెలియజేస్తూ ఉంటారు. ప్రస్తుతం కమల్ హాసన్ తో కలిసి భారతీయుడు-2, రామ్ చరణ్ తో కలిసి RC -15 వంటి సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అది కూడా కోలీవుడ్లో స్టార్ హీరో అయినటువంటి హీరో సూర్యతో ఆ సినిమా చేయబోతున్నట్లు వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. దాదాపుగా రూ. 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమైనట్లుగా సమాచారం. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే మొదలైనట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చోళ, పాండియన్ రాజుల తరహా కథ తో ఈ చిత్రం ఉండబోతున్నట్లు సమాచారం. మరి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ వినబడుతుందేమో చూడాలి మరి.

Share post:

Latest