ఆ లెజెండ్రీ పాత్ర కోసం మహేష్ ని అడిగారా… చేస్తే అదిరిపోయేది..!!

సూర్య హీరోగా వచ్చిన సినిమా ఆకాశమే నీ హద్దురా సినిమా విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సుధా కొంగర డైరెక్షన్ తో పాటు హీరో సూర్య నటన కూడా ఎంతో హైలెట్‌గా నిలుస్తుంది. మళ్లీ ఇదే సినిమాని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా సుధా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా అక్కడ కూడా మంచి హిట్ అయ్యింది. విమర్శకులతో పాటు సినీ జనం దగ్గర నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.. ఈ లేడీ డైరెక్టర్ సుధ కొంగర. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ను చేపడుతున్నట్టు తెలుస్తుంది.. ఈసారి కూడా మళ్లీ మరో బయోపిక్ తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది.

Aakaasam Nee Haddhu Ra Movie Review & Rating

ఆకాశమే నీ హద్దురా అనే సినిమాని ఎయిర్ డెక్కర్ ఫౌండర్ జి ఆర్ గోపీనాథ్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక తమిళంలో సురవై పోట్రికి వచ్చిన ఈ సినిమాను స్వయంగా సూర్య నిర్మించాడు సూర్య సొంత ప్రొడక్షన్ హౌస్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు గునీత్ మోంగా కూడా ఈ సినిమాకు నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఈ లేడీ డైరెక్టర్ కు వరుస ఆఫర్లు వచ్చాయి తెలుగులో కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఈమెకు పిలిచి మరి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆమె దాన్ని కూడా సున్నితంగా తిరస్కరించింది. ఇప్పుడు మరో బయోపిక్ పనిలో పడింది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సుధా భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా బయోపిక్ తీసే పనిలో పడిందని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన బయోపిక్ సంబంధించిన పూర్తి రీసెర్చ్ కంప్లీట్ చేసి స్క్రిప్ట్ వర్క్ చేయడం మొదలు పెట్టారట. ఈ బయోపిక్ లో రతన్ టాటా పాత్రను సూర్యా లేదా అభిషేక్ బచ్చన్ నటిస్తారని సమాచారం. ఈ బయోపిక్ సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన వెంటనే సుధా కొంగర ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారకంగా ప్రకటిస్తారట. ముందుగా ఈ బయోపిక్ కోసం హీరోగా మహేష్ బాబుని ఎంచుకున్నారని సమాచారం. అయితే మహేష్ కు వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో డేట్లు సర్దుబాటు అవ్వకపోవడంతో నో చెప్పినట్లు సమాచారం. దాంతో అభిషేక్ ని తెరపైకి తీసుకు వచ్చారని తెలుస్తుంది.

Share post:

Latest