ప్రాజెక్ట్ -k కి దీపిక హ్యాండిచ్చిందా..?

బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ప్రస్తుతం నాలుగైదు సినిమాలలో ఒకేసారి నటిస్తూ తన రేంజ్ను చూపించుకుంటోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టుకే సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే తన తదుపరి చిత్రం హృతిక్ రోషన్ సరసన ఫైటర్ లాంటి భారీ మల్టీ స్టారర్ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరొక రెండు చిత్రాలలో కూడా దీపిక పదుకొనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవలే సీనియర్ నటుడు అనిల్ కపూర్ తో కలిసి దీపికా పదుకొనే ఫైటర్ సినిమా షూటింగ్లో పాల్గొనింది.

Deepika Padukone wraps first schedule of Project K, shares pic of a  celebratory meal with Prabhas and others | Entertainment News,The Indian  Express

ఫైటర్ సినిమా కోసం భారీగానే కాల్ సీట్లను కేటాయించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీపిక ప్రభాస్ కి అన్యాయం చేస్తుందా అంటూ అభిమానులలో పలు సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు కే సినిమా వచ్చేయేడాది విడుదల కావాల్సి ఉన్నది. ఈ సినిమాని ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ దేశంలోనే ఎన్నడూ లేని విధంగా ఎవరు టచ్ చేయని అరుదైన కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో అమితాబచ్చన్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.

Fighter: Hrithik Roshan, Deepika Padukone team up for the first time! Hindi  Movie, Music Reviews and News

తాజా సమాచారం మేరకు ప్రాజెక్ట్ కె కాల్షీట్స్ మేనేజ్ చేస్తూనే ఫైటర్ సినిమా కోసం భారీ కాల్షీట్స్ కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కుమార్ కూడా ఫైటర్ లో ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు.తనతో కలిసి దీపిక సెట్స్ పైకి వెళ్తోంది. సిద్ధార్థ ఆనంద్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ హృతిక్ రోషన్ తో కలిసి అస్సాంలో తేజ్ పూర్ కు వెళుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానుల సైతం చాలా గుర్రుగా ఉన్నారు దీపికా పదుకొనే మీద.. ప్రాజెక్టు కే కోసం దర్శక నిర్మాతలు సంప్రదించినప్పుడు కాస్త బెట్టు చేసిన ఈ ముద్దుగుమ్మ ఫైటర్ సినిమా కోసం కాల్షీట్స్ ను కేటాయించింది దీంతో దీపిక వ్యవహారంపై ప్రభాస్ భిమానులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

Share post:

Latest