కమెడియన్ కృష్ణ భగవాన్ జీవితం అందుకే నాశనం అయ్యిందా?

కమెడియన్ కృష్ణ భగవాన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. నిన్న మొన్నటి వరకు తనదైన కామెడీతో తెలుగు తెరపై అలరించిన కృష్ణ భగవాన్ గత కొంతకాలంగా పత్తా లేకుండా పోయాడు. ఆఫర్లు లేనందున జబర్దస్త్ కామెడీ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈయన వచ్చిన తర్వాత షో టిఆర్పి రేటింగ్ బాగా పెరిగిపోయిందని బుల్లితెర వర్గాలు చర్చించుకుంటున్నాయి. మంచి కామెడీ టైమింగ్ తో పంచులు వేసే కృష్ణ భగవాన్ ఇంత పాపులారిటీ దక్కించుకున్నా కూడా సినిమాలలో అవకాశాలు రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా కైకవోలులో పుట్టిన కృష్ణ భగవాన్ మొదటి చెన్నైలో అవకాశాల కోసం నానా అవస్థలు పడ్డాడు. అలా మొదట వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ సినిమాతో తన సినిమా కెరియర్ ని స్టార్ట్ చేసాడు. అయితే మొదట మాత్రం నత్తనడక సాగినా 2002 తరువాత మాత్రం అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ‘వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ అనే సినిమా అతనికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆయన పంచులకు జనాలు కడుపుబ్బా నవ్వారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆయన వెనుతిరిగి మరలా చూసుకోలేదు.

2002 నుంచి 2018 వరకు నిరాటంకంగా సాగిన కృష్ణ భగవాన్ సినిమా జీవితం తరువాత తరువాత మాత్రం అంత సాఫీగా సాగలేదు. దానికి ముఖ్య కారణం తాగుడు అని చాలామంది చెప్పుకుంటూ వుంటారు. ఈ వ్యసనం ఎక్కువవడం వలెనే ఈ మధ్యకాలంలో అతనికి అవకాశాలు రాలేదని, ఆరోగ్యం కూడా సహకరించకపోవడం వలన, షూటింగ్ కూడా టైం కి రాకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి అని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఏదిఏమైనా ఆయనే తన చేజేతులారా సినిమా కెరీర్ని కోల్పోయాడని చెప్పవచ్చు.