భ‌ర్త చేసే టార్చర్‌ను బ‌య‌ట‌పెట్టిన న‌టి.. ఛీ.. ఛీ.. సుష్మితా సోద‌రుడు రాజీవ్ అంత దుర్మార్గుడా?

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకుల సంగతి మరోసారి వార్తల్లో నిలిచి వైరల్ గా మారింది. సుస్మిత తమ్ముడు రాజీవ్ సేన్ టీవీ నటి చారు అసోపాను 2019 జూన్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ దంపతులకు 11 నెలలు గల కూతురు ఉంది. అయితే వీరిద్దరూ పెళ్లి అయినా ఏడాదిన్నరకే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. కానీ తమ కూతురి కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామంటూ ఇటీవల తమ విడాకులను రద్దు చేసుకున్నారు.

ఆ విషయాన్ని బయటపెట్టిన రెండు నెలలకే మళ్లీ వీరిద్దరూ మళ్లీ విడిపోతున్నామంటూ తాజాగా వెల్లడించారు. తాజాగా ఈ వార్తలపై నటి చారు అసోపా ముంబై మీడియాతో ముచ్చటించిన ఆమె.. తన భర్త రాజీవ్ సేన్ పెట్టిన టార్చర్లపై మొట్టమొదటిసారి నోరు విప్పింది. ఆమె మాట్లాడుతూ.. వారి పెళ్లయిన కొద్ది రోజులకే వారి మధ్య గొడవలు మొదలయ్యాయంట.. పైగా గొడవైన ప్రతిసారి ఇల్లు వదిలి వెళ్ళిపోయేవాడు అని, అంతేకాకుండా కరోనా టైం లో కూడా మూడు నెలలు తనకు దూరంగా వెళ్లిపోయి ఫోన్ నెంబర్లు కూడా బ్లాక్ చేశాడంటూ ఆమె వాపోయింది. అయితే తన భర్త వల్లే తన కెరీర్ నాశనమైందంటూ ఎంతగానో మానసికంగా కృంగిపోయానంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది.

అయితే ఆ బాధ నుంచి బయటపడడం కోసం మళ్లీ `అక్బర్ కా బల్ బీర్బల్` తో తిరిగి షూటింగ్లో పాల్గొని వర్క్ పై దృష్టి పెట్టాను అంటూ ఆమె చెప్పింది. అయితే తాను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే రాజీవ్ తిరిగి వచ్చి తన వర్క్ విషయంలో కలగజేసుకోవడం మొదలుపెట్టాడంటూ.. అంతేకాకుండా తనకు దూరంగా ఉండాలంటూ తన కోస్టార్స్ అందరికీ మెసేజ్లు పెట్టి బెదిరించడం జరిగిందంటూ ఆమె చెప్పింది. ఆ కారణంగానే తనను ఆ షో నుండి నిర్మాతలు తొలగించేసారట.

దీంతో తాను విడాకులకు అప్లై చేయగా విడాకులు వద్దని తనను బాగా చూసుకుంటానని రాజీవ్ మాట ఇవ్వడంతో విడాకుల పత్రాలు క్యాన్సిల్ చేసుకున్నానని చెప్పింది. అయినప్పటికీ రాజీవ్ తన తీరు మార్చుకోకుండా మళ్లీ కొన్ని రోజులకే తనను నానా రకాలుగా టార్చర్ చేయడం మొదలుపెట్టాడంటూ ఆమె ఎంతగానో దుఃఖించింది. ఇక అందుకే అతను పెట్టే వేధింపులను భరించలేక అతనితో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నా అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్త చూసిన నెటిజన్లు ఛీ.. ఛీ.. సుష్మిత సోదరుడు రాజీవ్ అంత దుర్మార్గుడా..? భార్యను అంతా టార్చర్ చేసిన అలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Share post:

Latest