సత్తెనపల్లిలో తమ్ముళ్ళకు షాక్..జనసేనకే ఫిక్స్?

గత ఎన్నికల నుంచి టి‌డి‌పిలో గ్రూపు తగాదాలు ఎక్కువగా నడుస్తున్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..అందులో టాప్ లో మాత్రం సత్తెనపల్లి నియోజకవర్గం ఉందని చెప్పొచ్చు..గత ఎన్నికల్లో ఇక్కడ కోడెల శివప్రసాద్ ఓడిపోయిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ సీటుపై కోడెల వారసుడు శివరాం కన్నెసారు. ఆ సీటు దక్కించుకోవడం కోసం పనిచేస్తున్నారు.

అయితే కోడెల వారసుడుకు వ్యతిరేకంగా టి‌డి‌పిలో మరికొందరు పనిచేస్తున్నారు. ఆయనకు సీటు రాకుండా చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు సైతం నియోజకవర్గంలో యాక్టివ్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. అటు టి‌డి‌పి నేత మల్లిబాబు సైతం తనదైన శైలిలో పనిచేస్తున్నారు. మరోవైపు రాయపాటి రంగబాబు సైతం సత్తెనపల్లిపై కన్నేశారు. ఇలా టి‌డి‌పిలో వర్గ పోరు నడుస్తోంది. అందుకే ఇంచార్జ్ పదవి కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇలా కుమ్ములాటలు పెడుతున్నారని..సీటు విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇవ్వడం లేదు.

అంతా కలిసి పనిచేయాలని సూచిస్తున్న సరే వినడం లేదు..ఎవరికి వారే సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు. దీంతో బాబు సత్తెనపల్లి విషయంలో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగో జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి టి‌డి‌పి రెడీ అవుతుంది. ఈ క్రమంలో సత్తెనపల్లి సీటు జనసేనకు ఇచ్చేస్తే ఏ గోల ఉండదనే కోణంలో బాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

ఎలాగో టి‌డి‌పి నుంచి ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించే పరిస్తితి ఉండదు. దీని వల్ల పార్టీకి నష్టం. అదేదో జనసేనకు సీటు ఇస్తే..అంతా సహకరిస్తారని ఆలోచిస్తున్నారు. పైగా ఇక్కడ జనసేనకు కాస్త పట్టు ఉంది. కాబట్టి సత్తెనపల్లి సీటు ఆ పార్టీకి ఇచ్చేసి..సొంత పార్టీ నేతలకు చెక్ పెట్టాలని బాబు చూస్తున్నారని తెలుస్తోంది. చూడాలి మరి చివరికి సత్తెనపల్లి ఎవరికి దక్కుతుందో?