బ్రేకింగ్ -బాలకృష్ణ సంచలన ప్రకటన.. బాలయ్య అభిమానులకు పూనకాలే తెలిస్తే షాక్..!!

నందమూరి బాలకృష్ణ తన సినీ కెరియర్ లో మైలి రాయిగా నిలిచిపోయిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒకటి ఆదిత్య 369 ఇక ఈ సినిమాను సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లోనే ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీలో వస్తే టిఆర్పి రేటింగ్ అమాంతం పెరిగిపోతాయి… అప్పటివరకు తెలుగు సినిమా నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు, రెండు ఎమోషనల్ సీన్లు అన్నట్టుగా ఒకే పద్ధతిలో నడుస్తున్న కమర్షియల్ సినిమాకి కొత్త పుంతలు తొక్కించేలా చేసిన సినిమా ఇది.

30 years for Aditya 369: Nandamuri Balakrishna thanks Gen Z for all the  love | Telugu Movie News - Times of India

ఆదిత్య 369 సినిమాను టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని బాలకృష్ణ ఎన్నో సందర్భాలలో చెప్పాడు కూడా.. ఈ సినిమాని తానే సొంతంగా నిర్మించి దర్శకత్వం కూడా వహిస్తానని బాలకృష్ణ మరోసారి అధికారికంగా ప్రకటించాడు. ఇక నిన్న యువ‌ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ క్రేజీ మూవీ దమ్ కి సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాలయ్య వచ్చారు.

Das ka Dhamki Trailer Launch Event: బాలయ్య చేతుల మీదుగా దాస్ కా ధమ్కీ  ట్రైలర్ లాంచ్.. విశ్వక్ సేన్‌తో నటసింహం సందడి-baalkrishna is the chief  guest of das ka dhamki trailer launch event

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం మరియు నిర్మాత బాధ్యతలను కూడా ఈ సినిమాకు చేపట్టాడు.. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన బాలయ్య మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలయ్య మాట్లాడుతూ… చిన్న వయసులోని విశ్వక్ హీరోగా దర్శకుడుగా మరియు నిర్మాతగా పనిచేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ఘనవిజయం సాధించాలని నేను కోరుకుంటున్నా… నేను కూడా త్వరలోనే నా సొంత దర్శకత్వంలో ఆదిత్య 369 సినిమాకు సిక్వెల్ గా ఆదిత్య999 నీ డైరెక్ట్ చేయబోతున్నాను.. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ని కూడా వచ్చే సంవత్సరం ప్రారంభం కాబోతుంది..అంటూ బాలకృష్ణ తన ప్రసంగంలో తెలిపాడు.

Share post:

Latest