పవన్‌ని ముంచుతున్న కమలం..తేల్చేది ఎప్పుడు?

ఏపీలో పొత్తుల విషయంలో ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు..టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? లేక టీడీపీ-జనసేన లేదా? జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? అనేది ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు. చంద్రబాబు-పవన్ భేటీ జరిగినప్పుడు టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమని అనుకున్నారు. వాటితో బీజేపీ కూడా కలవచ్చని ప్రచారం జరిగింది. ఒకవేళ బీజేపీ కలవకపోయిన టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని, ఎందుకంటే వైసీపీకి చెక్ పెట్టాలంటే రెండు పార్టీలు కలిసి పోటీ చేయాల్సిందే అని, అలా కాకుండా విడిగా పోటీ చేస్తే రెండు పార్టీలకే నష్టమే..పైగా ఓట్లు చీలి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

అందుకే వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని అటు చంద్రబాబు, ఇటు పవన్ భావించి..కలవడానికి చూస్తున్నారు గాని ..మధ్యలో బీజేపీ కన్ఫ్యూజ్ చేస్తుంది..బీజేపీలో ఓ వర్గం టీడీపీకి అనుకూలంగా ఉండగా, ఓ వర్గం వైసీపీకి అనుకూలంగా ఉంది. ఇక వైసీపీకి అనుకూలంగా ఉండే వర్గం వారు..టీడీపీతో కలిసే ప్రసక్తి లేదని, పవన్ సైతం కలవరని అంటున్నారు.

తాజాగా సోము వీర్రాజు, జి‌వి‌ఎల్ నరసింహారావు..అదే తరహాలో మాట్లాడారు. పవన్‌తో కలిసే తాము పోటీ చేస్తామని, టీడీపీతో కలిసే ప్రసక్తి లేదని అన్నారు. వైసీపీకి అసలైన ప్రత్యామ్నాయం తామే అన్నారు. ఇలా బీజేపీ నేతల ప్రకటనలతో జనసేనలో కన్ఫ్యూజన్ వచ్చింది. అసలు టీడీపీతో కలిసి వెళ్లాలా, బీజేపీతో వెళ్లాలా అని ఆలోచనలో పడ్డారు.

ఎంత లేదు అనుకున్న బీజేపీతో వెళితే జనసేనకు ఫలితం శూన్యం..టీడీపీతోనే బెనిఫిట్. అటు టీడీపీకైనా జనసేనతో కలిస్తేనే ప్లస్. కానీ జనసేన క్లారిటీగా లేకపోవడం, పైగా తమ వైపే ప్రజలు చూస్తున్నారని, కాబట్టి సింగిల్ గా వెళ్లాలనే అంశంపై చంద్రబాబు ఆలోచిస్తున్నారని, తమ నాయకులని కూడా సింగిల్ గానే పోటీకి సిద్ధంగా ఉండాలని అంతర్గతంగా చెబుతున్నారని తెలిసింది. మొత్తానికి బీజేపీ వ్యవహారం పవన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. మరి ఈ పొత్తుల అంశం ఎప్పుడు తేలుస్తారో చూడాలి.