వైయస్సార్ ను లైవ్ లోనే పొగిడేసిన బాలయ్య..!

ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోకి ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలోనే ప్రస్తుతం ఈ టాక్ షో నెంబర్ వన్ షోగా పలు రికార్డులను సైతం సృష్టిస్తోంది. ఈసారి అన్ స్టాపబుల్ సీజన్ ని సరికొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమాల నుంచి కాకుండా రాజకీయ ప్రముఖులను కూడా ఈ షో కి అతిధులుగా తీసుకువచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరుగుతోంది. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ రావడం కూడా జరిగింది.

Unstoppable episode 4 : పాత మిత్రులు కలిసినప్పుడు.. వారి మధ్య మాటలు 'అన్‌స్టాపబుల్'.. - 10TV Telugu
ఇప్పుడు తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అతిథిగా వచ్చారు. మరొక అతిథి ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు. సాధారణంగా ఈ షోలో బాలయ్య చేసే సందడి అంతా కాదు. ఇక బాలయ్య ,కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి అందరూ మిత్రులు కావడంతో ఈ షో మొత్తాన్ని ఒక ఊపు ఊపేశారని చెప్పవచ్చు. ఇక వీరందరి మధ్య జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావించారు కిరణ్ కుమార్ రెడ్డి. స్పీకర్ అయిన తర్వాత బాలకృష్ణ అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి అధ్యక్ష నా మైక్ కట్ చేశారు అంటూ చెప్పినట్లుగా బాలయ్య కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

ఇక సీఎం అవ్వడం పైన ప్రశ్నించగా.. నేను బతికే ఉన్నాను కాబట్టి సీఎం అయ్యాను అని కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ ఆన్సర్ తెలిపారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గురించి ప్రస్తావిస్తూ.. ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ బాలయ్య చాలా ఎమోషనల్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి ఒక గొప్ప నాయకుడు అంటూ బాలయ్య కూడా తెలియజేశారు. ప్రస్తుతం బాలయ్య చేసిన ఈ కామెంట్స్ ప్రోమోలో వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest