ఆ విషయంలో బాలయ్య రైట్ చిరంజీవి రాంగ్..!!

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల హవా బాగానే కొనసాగుతుందని చెప్పవచ్చు. సీనియర్ హీరోలు అయినప్పటికీ ప్రస్తుతం రూ.100 కోట్ల రూపాయలకంటే తక్కువ మొత్తంలో బిజినెస్ జరుగుతోంది. చిరంజీవి ప్రస్తుతం ఒక్కో చిత్రానికి 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉన్నారు.కానీ బాలయ్య రూ.15 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇద్దరు హీరోలు మధ్య ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ వ్యత్యాసం ఉండడం గమనార్హం. అఖండ సినిమాకు బాలయ్య రూ.10 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోక వీర నరసింహారెడ్డి సినిమాకు రూ.12 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

No entry for 'Chiru, Balayya and Nag at shoots?

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమాకి రూ.15 కోట్ల రూపాయలు పారితోషకం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక తన సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా కూడా బయర్లు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలకు రిస్క్ ఉండదని చెప్పవచ్చు. ఈ రీజన్ వల్లే బాలయ్య సినిమాలు ప్లాప్ అయిన ఎప్పుడు కూడా వివాదాలలో చిక్కుకోలేదు. అయితే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాకు సైరా నరసింహారెడ్డి సినిమాకు రూ.30 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నారు చిరంజీవి.

Chiru, Balayya Stunning With Transformations | cinejosh.comఈ రెండు సినిమాలు చిరంజీవి సొంత బ్యానర్ లోనే నిర్మించారు.అయితే ఆచార్య సినిమా చిరంజీవి పారితోషకం రూ. 40 కోట్లు డిమాండ్ చేయగా.. గాడ్ ఫాదర్ సినిమాకు రూ. 50 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించలేదు. ఇక చిరంజీవి అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం చిరంజీవి తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటే తను నటించే సినిమాలకు నష్టాలు ఉండవని విషయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అందుచేతనే బాలయ్య సినిమాలకు ప్లస్ అవుతుంటే చిరంజీవి సినిమాలకు మైనస్ అవుతుందని కామెంట్స్ చేస్తూ ఉన్నారు.