పొత్తులపై మళ్ళీ ట్విస్ట్..బాబు రూట్ ఎటు?

ఏపీలో పొత్తుల విషయంలో ట్విస్ట్‌లు కొనసాగుతూనే ఉన్నాయి..అధికారంలో ఉన్న వైసీపీకి చెక్ పెట్టాలంటే ప్రతిపక్ష టీడీపీ పూర్తి బలం సరిపోవడం లేదు..ఇంకా ఆ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. పైగా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుందని అనుకుంటే..ఆ వ్యతిరేక ఓట్లు టీడీపీకే కాదు..జనసేన వైపు కాస్త వెళుతున్నాయి. దీంతో వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది. అందుకే చంద్రబాబు..పవన్‌ని కలుపుకుని వెళ్లాలని చూస్తున్నారు.

అటు పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని చెబుతూ..టీడీపీతో కలిసేందుకు చూస్తున్నారు. ఎలాగో సింగిల్ గా పోటీ చేస్తే టీడీపీకి నష్టం..ఇటు జనసేనకు పది సీట్లు కూడా రావు. అందుకే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే..వైసీపీకి పెద్ద రిస్క్. అయితే టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ అడ్డంకి అవుతుంది. ఆ పార్టీకి ఎలాగో ఒక్క సీటు, ఒక్క శాతం ఓట్లు తెచ్చుకునే బలం లేదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉండటం, పవన్‌తో కలిసి ముందుకెళ్లడం వల్ల సమీకరణాలు ఎలాగైనా మారేలా ఉన్నాయి.

ఇటీవల పవన్..మోదీతో భేటీ అయ్యాక రాజకీయం మారింది..అంతర్గతంగా బీజేపీ…జనసేనని టీడీపీతో కలవకుండా చేయడమే టార్గెట్‌గా పెట్టుకుందని తెలుస్తోంది. అప్పుడు ఓట్లు చీల్చి పరోక్షంగా జగన్‌కు మేలు చేయడమే బీజేపీ అంతిమ లక్ష్యమని తెలుస్తోంది. సోము వీర్రాజు, జి‌వి‌ఎల్ నరసింహారావు లాంటి వారు కూడా జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని, టీడీపీతో పొత్తు లేదని, తామే వైసీపీకి ప్రత్యామ్నాయం అని అంటున్నారు.

అంటే ఇక్కడ టీడీపీకి జనసేనని దూరం చేయడమే బీజేపీ టార్గెట్..ఆ రెండు పార్టీలు ఓట్లు చీలిస్తే వైసీపీకి మేలు జరుగుతుంది. అయితే పొత్తుల విషయంలో సరైన క్లారిటీ రావడం లేదు..దీంతో సొంతంగా బలపడేలా బాబు ప్రణాళికలు రచిస్తున్నారని తెలిసింది. ఎలాగైనా వైసీపీ వ్యతిరేక ఓట్లు టీడీపీకే వచ్చేలా చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారట. సోలో ఫైట్‌కు వెళ్ళేలాగానే రాజకీయం చేయాలని చూస్తున్నారు. మరి చూడాలి పొత్తుల లెక్కలు ఎప్పుడు తేలతాయో.

Share post:

Latest