అనిత చౌదరి.. ఈ పేరు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ లో యాంకర్ గా తన సినీ కెరియర్ ని స్టార్ట్ చేసిన ఈమె ..ఆ తరువాత పలు సినిమాల్లో కూడా నటించి తన నటన కు మంచి మార్కులు వేయించుకుంది. 90’స్ లో యాంకరింగ్ అంటే ముఖ్యంగా గుర్తు వచ్చేది సుమ ,ఝాన్సీ ,అనిత చౌదరి . కాగా వీళ్ళ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఆ టైం లో జనాలను బాగా ఆకట్టుకున్నారు . అంతేకాదు సింగర్ సునీత కూడా వీళ్ళకి మంచి క్లోజ్ ఫ్రెండ్. ఏ ఫంక్షన్ జరిగినా ఏ ఈవెంట్ అయినా ఈ నలుగురు కలిసి సందడి చేసేవారు .
కాగా పలు సీరియల్స్ లో కూడా నటించిన అనిత చౌదరి చిన్నతనంలోని నాన్న వదిలేసి వెళ్లిపోవడంతో.. కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకొని.. చిన్న చిన్న సరదాలకు కూడా దూరమైంది . కాగా సినిమాల్లో ఆమెకు హీరోయిన్ గా ఛాన్సెస్ వచ్చినా సరే ..ఆమె హీరోయిన్గా చేయడానికి ఒప్పుకోలేదట . ఎందుకంటే ఆమెకు తెలుసు తన బాడీ దేనికి సెట్ అవుతుంది. ఏ పాత్రకు ఎలా చేయాలో నేను హీరోయిన్ సెట్ కాను అని ఆమె చెప్పుకు వచ్చింది .
అంతేకాదు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే సునీత , ఝాన్సీ వాళ్ల వ్యక్తిగత లైఫ్ లో జరిగిన విషయాలను నాకు ఎప్పుడు చెప్పేవారు కాదని.. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే వాళ్లే ఫేస్ చేసే వారిని ..ప్రొఫెషనల్ లైఫ్ కి పరసనల్ లైఫ్ కి చాలా డిస్టన్స్ మెయింటైన్ చేసే వారని చెప్పుకొచ్చింది . మనకు తెలిసిందే సింగర్ సునీత, యాంకర్ ఝాన్సీ ఇద్దరు పెళ్లిళ్లు చేసుకొని చాలా కష్టాలు పడ్డారు .కాగా రీసెంట్ గానే సింగర్ సునీత రెండో వివాహం చేసుకొని సంతోషంగా ఉన్నా.. ఝాన్సీ మాత్రం ఇంకా అలా సింగల్ గానే ఉండిపోయింది . ఏది ఏమైనా సరే ఎంత ఫ్రెండ్స్ అయినా సరే మనకంటూ కొన్ని పరసనల్స్ ఉంటాయి కదా..అలా వాళ్లు నా తో కొన్ని విషయాలు షేర్ చేసుకోలేకపోయారు అని చెప్పుకువచ్చింది.