తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా అంటున్న ఆండ్రియా..!

ప్రముఖ సింగర్ గా గుర్తింపు తెచ్చుకొని.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగిన ఆండ్రియా జరేమియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సింగర్ గా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె సినిమాలలోకి వచ్చిన తర్వాత హీరోయిన్ గా అంతే క్రేజ్ సొంతం చేసుకుంది.. ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎన్నో ఇబ్బందులు ఎదురవడం సర్వ సాధారణం.. అయితే కొంతమంది వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడితే.. మరి కొంతమంది వాటిని తట్టుకోలేక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. మరికొంతమంది తమకు కూడా ఇలాంటి వేదింపులు ఎదురయ్యాయని ఆ అనుభవాలను బయటపెట్టారు. ఈ క్రమంలోనే నటి ఆండ్రియా కూడా తన బాధను వెళ్ళగక్కింది.I don't think I've ever played a conventional heroine': Andrea Jeremiah to  TNM | The News Minute

తాజాగా ఈమె నటించిన చిత్రం అనల్ మేలే పలితులి.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ఆండ్రియా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో కూడా శరవేగంగా పాల్గొంటుంది. ఇక ఈ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియా తన జీవితంలో ఎదురైనా చేదు సంఘటనను గుర్తుచేసుకొని మరీ ఎమోషనల్ అయింది. అయితే ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో చెబుతూ కానీ ఎదుర్కొన్న లైంగిక దాడి గురించి కూడా తెలపడం గమనార్హం.Pisasu 2 Actress & Singer Andrea Jeremiah Says “My Piano Is An Integral  Part Of My Songwriting”

ఆండ్రియా మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు నా కుటుంబంతో కలిసి వేలాంగణి మాతకు బస్సులో ప్రయాణం చేస్తున్నాము. అయితే ఆ బస్సు ప్రయాణంలో నా తండ్రి పక్కన నేను కూర్చుని వెళుతుండగా.. ఒక్కసారిగా వెనుక నుంచి ఒక వ్యక్తి నా టీ షర్టు వెనుక వైపు నుంచి తన చేతిని లోపల పెట్టాడు అయితే అది నా తండ్రి చెయ్యి అనుకున్నాను.. కానీ కొంతసేపటికి ఆ వ్యక్తి చెయ్యి మరింత లోపలికి వెళ్లడంతో ఒక్కసారిగా నాన్న వైపు చూడగా ఆయన రెండు చేతులు బయటే ఉన్నాయి. దీంతో ఉలిక్కిపడిన నేను వెంటనే అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్లిపోయాను అంటూ తెలిపింది.

ఇకపోతే ఇప్పటివరకు కూడా తన తండ్రికి ఈ విషయం చెప్పలేకపోయాను అని తెలిపింది ఆండ్రియా.. బహుశా మనం పుట్టి పెరిగిన సమాజంలోని కట్టుబాట్లు దృష్టిలో పెట్టుకొని ఈ విషయం నాన్నతో చెప్పలేదేమో అని తనకే అనిపించింది అంటూ తెలిపింది. మొత్తానికైతే ఆండ్రియా చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest