సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులైన, డైరెక్టర్లైన, నిర్మాతల కైనా కలిసి వస్తేనే సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. అయితే అలా అదృష్టం కలిసి వచ్చి రెండుసార్లు స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసిన ఒక దర్శకుడు తన కెరీయర్ని మార్చుకోలేకపోయారు.ఆ డైరెక్టర్ ఎవరో కాదు డాలి అలియాస్ కిషోర్ కుమార్ పార్థసాని.. మొదట్లో వివి వినాయక్ , నల్లమలుపు బుజ్జి వంటి దర్శకులతో రూమ్ షేర్ చేసుకునే వారు డాలి. ఆ రూముని వీరందరూ కలిసి పుష్పక విమానం పిలుచుకునేవారు. అక్కడ నుంచే ఎంతో మంది దర్శకులు అయ్యారట.
అంతేకాకుండా ఆ రూంలో ఎవరు దిగినా సరే కచ్చితంగా వారికి సినిమా అవకాశాలు వస్తాయని నమ్మకం ఉండేదట.అలా పుష్పకవిమానంలో అడుగుపెట్టి నిజంగానే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వి. వి వినాయక్ కి మంచి అనుబంధం ఉన్నది డాలికి. అలా మొదటిసారి ఆనందం సినిమా కోసం శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకొని డాలి సిద్ధార్థ తమన్నాతో కలిసి కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సినిమాని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది.
అటు తరువాత బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో తడాఖా సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా పరవాలేదు అనిపించుకుంది. ఆ వెంటనే వెంకటేష్ ,పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన గోపాల గోపాల అనే సినిమాని తీయగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ తో కాటమరాయుడు సినిమాని ఒప్పించగా అందుకు తగ్గట్టుగా ఈ సినిమాను తెరకెక్కించి విడుదల చేయగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తన 13 ఏళ్ల కెరియర్లో కేవలం నాలుగు సినిమాలను చేసిన డాలి పవన్ తో రెండు సినిమాలు చేసిన మళ్లీ ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు ఈ డైరెక్టర్. మరి ఏం చేస్తున్నారనే విషయం తెలియాల్సి ఉంది.