తండ్రి మెగాస్టార్, కొడుకు కనీసం పేరు తెచ్చుకోలేయపోయాడు.. ఎవరో తెలుసా?

భారతీయ సినిమా పరిశ్రమలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్ర ఎంతో ప్రాముఖ్యత కలిగినది. దాదాపు అర్థ శతాబ్ధంపైనే ఆయన తన సినిమా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయన సాధించినన్ని విజయాలు ఇంకెవరూ సాధించలేదేమో అని చెప్పడానికి నిస్సంకోచం అనవసరం. ఆయన చేసినన్ని ప్రయోగాలు కూడా వేరొకరు చేయలేదు. దేశం నలుమూలల ఉన్న బడా స్టార్లంతా తమకు అమితాబ్ స్ఫూర్తి అని సగర్వంగా చెప్పుకుంటూ వుంటారు. అలాంటి ఘనచరిత కలిగిన బచ్చన్ ల వంశం నుంచి నుండి వచ్చిన వారసుడు అభిషేక్ బచ్చన్ సూపర్ స్టార్ స్థాయిని అందుకోకపోవడం దురదృష్టకరమనే చెప్పుకోవాలి.

అయితే అతగాడు కష్టపడలేదా? అంటే… అమితాబ్ వారసుడిగా అభిషేక్ బచ్చన్ తన స్థానాన్ని మెరుగు పరుచుకునేందుకు చాలా గట్టిగానే ప్రయత్నించాడు. ఎంతగా ప్రయత్నించినా నేటి కాంపిటీషన్ లో అది అతనికి సాధ్యం కాలేదు. దాంతో అతగాడు ఒక సాధారణ నటుడిగానే మిగిలిపోయాడు తప్ప తండ్రి లెగసీని ముందుకు నడిపించడంలో తడబడ్డాడు. అయితే అభిషేక్ ఎదుగుదలకు అమితాబ్ సూచనలు సలహాలు సహకరించలేదా? తనని విమర్శించిన నోళ్లను మూయించేందుకు అతడు ఎలాంటి ప్రయత్నం చేయలేదా? అనే మాటలు కూడా వస్తున్నాయి.

ఈ విమర్శలను ఉద్దేశించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ… 2 దశాబ్దాల కెరీర్ లో హెచ్చు తగ్గులను చాలా వాటిని చవి చూసానని తెలిపాడు. కొన్నిసార్లు విమర్శకుల ప్రశంసల అవార్డులు కూడా పొందానని చెప్పుకొచ్చాడు. అయితే ఎంత కష్టపడినా, బిగ్ బి అనుభవాల నుంచి నేర్చుకున్నవి తాను పాటించినా… ఎదగలేకపోయిన హీరోగా ప్రస్తుతం మిగిలిపోయాడు. అయితే సినిమా రంగంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేము. చూడాలి మరి, రానున్న రోజుల్లనైనా అభిషేక్ కి మంచి పాత్రలు పడి సూపర్ సక్సెస్ కొట్టాలని ఆశిద్దాం.