`ఊర్వశివో రాక్షసివో` హిట్ అన్నారు.. మ‌రి ఈ వ‌సూళ్లు ఏంటి సామి?

అల్లు శిరీష్, అను ఇమాన్యుయెల్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ `ఊర్వశివో రాక్షసివో`. అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. ఆమని, సునీల్‌, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను అందుకుంది. ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా బాగా ఎట్రాక్ట్ చేసింది‌. ఇక టాక్‌ అనుకూలంగా ఉండడంతో గత కొన్నేళ్ళ నుంచి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అల్లు శిరీష్, అను ఇమాన్యుయెల్ హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కారని అంటున్నారు.

కానీ వ‌సూళ్లు చూసి సినీ విశ్లేష‌కులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఎందుకంటే, టాక్ బాగున్నా క‌లెక్ష‌న్స్ మాత్రం యావ‌రేజ్‌గా ఉన్నాయి. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 7 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేసి, రూ. 7.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. తొలి వారం పూర్తి అయ్యే స‌మయానికి రూ. 2.62 కోట్ల షేర్‌, రూ. 4.95 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను మాత్ర‌మే రాబ‌ట్ట‌గ‌లిగింది. టార్గెట్‌ను రీచ్ అవ్వాలంటే ఇంకా రూ. 4.99 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది. మ‌రి శిరీష్ ఇంత పెద్ద టార్గెట్ ను అందుకుంటాడా..? లేదా..? అన్న‌ది చూడాలి.

Share post:

Latest