జాన్వి కపూర్ తో పోటీ పడుతున్న అల్లు అర్జున్ భార్య..!!

రోజులు గడిచే కొద్దీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి అందాల ప్రదర్శనలో రోజురోజుకు హీరోయిన్లు మించిపోతుంది. గత కొంతకాలంగా స్నేహ రెడ్డి క్రమం తప్పకుండా తన హాట్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం స్నేహ రెడ్డి ‘ది ట్రీ ఆఫ్ లైఫ్’ కలెక్షన్ లో భాగంగా ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన ఓ స్టైలిష్ గౌను ధరించి సోషల్ మీడియాలో అలరించింది.

Allu Sneha Reddy: అల్లు స్నేహ రెడ్డి సినిమాల్లో నటించడం నిజమెంత

ఆ గోల్డెన్ డ్రెస్ లో స్నేహారెడ్డి అచ్చం హీరోయిన్ లాగా కనిపించింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే, ఉన్నట్టు ఉండి ఈ రోజు ఉదయం నుంచిస్నేహ రెడ్డి ఫోటోలు మళ్ళీ హాట్‌ టాపిక్ గా మారాయి. దానికి ప్రధాన కారణం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా స్నేహ రెడ్డి వేసుకున్న సేమ్ అలాంటి డ్రెస్ నే వేసుకోవడంతో ఇప్పుడు ఇద్దరి హాట్ భామల ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ఒకే రకం డ్రెస్ లో ఇటు స్నేహారెడ్డి ఆటు జాన్వి కపూర్ చాలా స్టైలిష్ గా ఉన్నారు. అందుకని నెటిజన్లు ఇద్దరి ఫోటోలను ఒకే ఫ్రేమ్లో పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ స్నేహారెడ్డి ని ప్రేమించి మరి వివాహం చేసుకున్నాడు. వీరిపెళ్లి అయ్యి 11 ఏళ్లు పూర్తయింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా స్నేహారెడ్డి తన గ్లామర్ షో తో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. గ‌త‌ కొద్దిరోజులుగా స్నేహారెడ్డి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి.

Share post:

Latest