అలియా భట్, రష్మిక ఇంకా ఇతర హీరోయిన్లు పబ్లిక్‌లో చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ ఇవే!

సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఆచితూచి మాట్లాడాలి. లేకుంటే నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వారిని కడిగి పారేసే ప్రమాదం లేకపోలేదు. అయితే ఈ విషయం మరిచి కొందరు స్టార్ హీరోయిన్లు తప్పుగా మాట్లాడి బుక్ అయ్యారు వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

రష్మిక మందన్న

ప్రస్తుతం సౌత్ ఇండియన్‌ స్టార్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లో కూడా దూసుకుపోతోంది. ఎన్ని భాషల్లో నటిస్తున్న నిజానికి ఈ ముద్దుగుమ్మ అసలు ఇండస్ట్రీ కన్నడ అని చెప్పొచ్చు. అయితే కన్నడ ఇండస్ట్రీ నుంచి మొన్న ఈ మధ్య రిషబ్ శెట్టి హీరోగా ‘కాంతారా’ మూవీ వచ్చింది. ఇది బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. కాగా ఆ సినిమాను తాను ఎంతవరకి చూడలేదంటూ రష్మిక నోరు జారింది. దాంతో సొంత ఇండస్ట్రీ సినిమాలను చూసి, ప్రోత్సహించాల్సిన మీరే ఇలా అంటే ఎలా? అని చాలామంది ఆమెను ఏకిపారేశారు.

అలియా భట్

ఆర్ఆర్ఆర్ ఫేమ్ అలియా భట్ ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’ సినిమా విడుదలకు ముందు సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘మీకు నచ్చకపోతే నా సినిమాలు చూడటం మానేయండి’ అహంభావంతో కామెంట్స్ చేసింది. దాంతో చాలామంది ఆమెను తిట్టుపోశారు.

జాన్వీ కపూర్

జాన్వీ కపూర్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు. ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ బాలీవుడ్‌లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఉంది. జాన్వీ తన నటన కీ ఎన్నో ప్రశంసలు పొందింది. అలానే వివిధ సందర్భాలలో ఆమె చేసిన వ్యాఖ్యలకు విమర్శలను కూడా ఎదుర్కొంది. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ‘నాకు ఫేమ్ అవసరం లేదు, నేను ఇప్పటికే ఫేమస్ అయ్యాను’ అని అహంకార కూతలు కూసింది. దాంతో.. ‘ఈమె సినిమాలు చూడటం మానేస్తే.. అప్పుడేనా ఈ తల పొగరు తగ్గుతుందేమో’ అని చాలామంది ఆమెకు చివాట్లు పెట్టారు.

అనన్య పాండే

చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే కరణ్ జోహార్ షోలో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయగా అవి వివాదాన్ని రేపాయి. ఈ ముద్దుగుమ్మ తనకేం టాలెంట్ లేదన్నట్లు.. తల్లిదండ్రుల రికమండేషన్‌తోనే సినిమాల్లోకి వచ్చినట్లు.. తండ్రి యాక్టర్ కావడం వల్ల తాను కూడా యాక్టర్ అయ్యానని.. వచ్చిన ప్రతి ఆపర్చునిటీని కొత్తవారికి వెళ్లకుండా తానే లాగేస్తానన్నట్లుగా కామెంట్లు చేసింది. ఈ వ్యాఖ్యలపై కూడా విమర్శలు వచ్చాయి.

Share post:

Latest