ఆదిపురుష్ సినిమా మళ్లీ వాయిదా పడిందా..!!

టాలీవుడ్లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ తన తదుపరి చిత్రాల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ వంటి సినిమాలు భారీ స్థాయిలో విడుదల కాగా ఈ సినిమాలు భారి డీజాస్టర్ గా మిగిలాయి. దీంతో ఈ సినిమా నిర్మించిన దర్శకులు సైతం కనుమరుగయ్యారని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సాలర్, ఆది పురుష్, ప్రాజెక్ట్-k తదితర చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆది పురష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేశారు.

Adipurush: Prabhas Starrer Delays Release Plans After Severe Backlash?  Here's What We Know
అయితే ఇప్పుడు కొన్ని కారణాల చేత ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా ఎక్కువ గ్రాఫిక్స్ ఉండడం వల్ల మరింత గా తీర్చిదిద్ది ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక గత కొద్ది రోజుల క్రితం ఆదిపురష్ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఇందులోని నటీనటుల పైన, పాత్రలపైన పలు రకాలుగా ట్రోల్స్ రావడం జరుగుతొంది.

Adipurush: Prabhas, Kriti Sanon & Others Face Legal Notice For Allegedly  Insulting Hindu Religion - Deets Inside
ఇక అంత చేతనే ఈ సినిమా విఎఫ్ ఎక్స్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం వల్ల ఈ సినిమా వాయిదా వేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరి కొంతమంది సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు తదితర సినిమాలు ఉండడం వల్ల.. ఆది పురుష్ సినిమా వాయిదా వేయడం జరిగింది అనే కామెంట్లు చేస్తూ ఉన్నారు నేటిజన్స్. మరి ఆది పురుష్ సినిమా వాయిదా విషయం నిజమో కాదో చిత్ర బృందం క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

Share post:

Latest