మళ్ళీ రేటు పెంచేసిన శ్రీ‌లీల‌.. ఇలాగైతే ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చుక్క‌లే!?

తొలి సినిమాతోనే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ల జాబితాలో శ్రీలీల ఒకరు. యునైటెడ్ స్టేట్స్‌లో పుట్టి బెంగుళూరులో పెరిగిన ఈ అమ్మ‌డు.. గత ఏడాది విడుదలైన `పెళ్లి సందD` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది.

అలాగే శ్రీలీల‌కు ఈ సినిమాతో కావాల్సినంత క్రేజ్ ద‌క్కింది. ఈ మూవీ తర్వాత శ్రీ‌లీల‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ అందాల సోయ‌గం మాస్ మహారాజ్‌ రవితేజ కి జోడిగా `ధమాకా` చిత్రంలో నటిస్తోంది. అలాగే నితిన్ తో `జూనియర్` అనే సినిమా చేస్తోంది. వైష్ణ‌వ్ తేజ్‌తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

అలాగే మరోవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కబోయే `ఎన్‌బీకే 108`లో భాగం కాబోతోంది. ఇందులో బాలయ్య కూతురుగా శ్రీ లీల ఎంపిక అయింది. అలాగే మరిన్ని ప్రాజెక్టులు కూడా శ్రీ‌లీల‌ చేతిలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న ఫార్ములాను శ్రీలీల తూచా తప్పకుండా ఫాలో అవుతోందట.

వ‌రుస ఆఫర్లు వస్తున్న తరుణంలో ఈ అమ్మడు తన రెమ్యున‌రేష‌న్ ను అంతకంతకు పెంచుకుంటూ పోతోందట. తొలి సినిమాకు రూ. 20 లక్షలు కూడా తీసుకోని శ్రీ‌లీల.. ఆ త‌ర్వాత కోటికి పెంచేసింది. ఇక ఇప్పుడు కోటిన్నర ఇస్తేనే సినిమాకు సైన్ చేస్తానని తెగేసి చెబుతుందట. ఏదేమైనా శ్రీ‌లీల ఇలా తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోతుంటే దర్శకనిర్మాతలకు చుక్కలు ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

Share post:

Latest