పెళ్లి ఎప్పుడో చెప్పేసిన హీరో విశాల్‌.. ఇక జ‌రిగిన‌ట్లే?!

తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఈయ‌న‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలోనే విశాల్ నటించిన ప్రతి సినిమాను తమిళం తో పాటు తెలుగులోనూ విడుదల చేస్తుంటారు. త్వరలోనే ఈయన `లాఠీ` సినిమాతో తెలుగు తమిళ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఆదివారం నాడు ఈ సినిమా టీజ‌ర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా విశాల్‌ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

అలాగే తన పెళ్లి ఎప్పుడు అన్న విషయంపై అందరికీ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. విశాల్ ప్రస్తుతం దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ బిల్డింగ్ పూర్తయిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ పేర్కొన్నాడు. 3,500 మంది నటీనటులుచ‌ రంగస్థల కళాకారుల కోసం ఆ భవనాన్ని నిర్మిస్తున్నట్లు వేదికపై విశాల్ వెల్లడించాడు. కళాకారుల జీవితాన్ని మెరుగుపరిచేందుకు త‌న‌ బృందం తీవ్రంగా శ్రమిస్తుందని విశాల్ తెలిపాడు.

ఆ బిల్డింగ్ నిర్మాణం త్వ‌ర‌లోనే కంప్లీట్ కానుంద‌ని, ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటానని విశాల్ పేర్కొన్నాడు. కాగా గతంలో విశాల్ తెలుగు అమ్మాయి అనీషా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆరేళ్ల పాటు సహజీవనం చేసిన ఈ జంట ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నారు కానీ పెళ్లి పీటలు ఎక్కక ముందే బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు.

ఆ తర్వాత విశాల్‌ పెళ్లి గురించి ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. కానీ అవ‌న్నీ పుకార్లుగానే మిగిలాయి. పైగా ప్రస్తుతం విశాల్ వయసు 45కు చేరుకుంది. అయినా సరే ఆయ‌న సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ బిల్డింగ్ నిర్మించాకే పెళ్లి చేసుకుంటానని తాజాగా వెల్లడించారు. దీంతో కొంద‌రు నెటిజ‌న్లు విశాల్ ఆశయం త్వరగా నెరవేరాలని ఆకాక్షిస్తుంటే.. కొందరు మాత్రం సెటైర్లు పేలుస్తున్నారు. ఇప్పటికే చాలా వయసు అయిపోయిందని ఇంకా లేట్ చేస్తే ఇక జ‌రిగిన‌ట్లే అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Share post:

Latest