మ‌హేష్ కుటుంబంలో వ‌రుస విషాదాల‌కు ఆ న‌టినే కార‌ణ‌మా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓకే ఏడాది కుటుంబానికి పెద్ద దిక్కుగా భావించిన ముగ్గురును కోల్పోవడంతో మహేష్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నేటి తెల్లవారుజామున మహేష్ తండ్రి, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ప‌లు అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. అలాగే నెలన్నర క్రితం అనగా సెప్టెంబర్ 28న మహేష్ తల్లి ఇందిరా దేవి మరణించారు.

ఇక ఈ ఏడాది ఆరంభంలో మహేష్ తన సోదరుడు రమేష్ బాబును కూడా కోల్పోయారు. అయితే మహేష్ కుటుంబంలో వరస విషాదాలు సంభ‌వించ‌డానికి ప్ర‌ముఖ నటి పవిత్ర లోకేష్ కారణం అంటూ కొందరు నెటిజ‌న్లు ఆమెపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. అందుకో కారణం లేకపోలేదు. నటుడు నరేష్, పవిత్ర లోకేష్ స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌ని, వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గ‌త కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

వీరి వివాహానికి కృష్ణ కూడా అంగీకరించారంటూ వార్తలు వచ్చాయి. పైగా వీరిద్దరి రిలేషన్ షిప్ పై ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. అయితే నరేష్ పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్న తర్వాతే మహేష్ బాబు కుటుంబంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఆమె ఘట్టమనేని కుటుంబంలో అడుగు పెట్టిన‌ప్ప‌టినుంచి అశుభాలే జరుగుతున్నాయంటూ అభిమానులు మరియు పలువురు నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా, కృష్ణ మరణ వార్త తెలియగానే నరేష్ పవిత్ర లోకేష్ తోనే కాంటినెంటల్ హాస్పిటల్‌కు చేరుకోవడంతో అభిమానులు మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Share post:

Latest