బాలీవుడ్ టాప్ 10 లిస్ట్‌లో చేరిన సౌత్ డబ్బింగ్ సినిమాలు ఇవే… కాంతారా స్థానం ఇదే!

సౌత్ సినిమాలంటే చిన్నచూపు కలిగిన బాలీవుడ్లో గత కొన్నాళ్లుగా సౌత్ సినిమాలు రాజ్యమేలుతున్నాయి. ఓ రకంగా మన హీరోలు అక్కడి ఖాన్లకు ఎదురెల్లుతున్నారు. ఈ పెను మార్పులు దర్శకధీరుడు జక్కన్న తోనే మొదలైందని వేరే చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా బాహుబలికి ముందు, తరువాత అన్నమాదిరి తయారయ్యింది. ఇక ఆ తరువాత వచ్చిన RRR సినిమా కూడా బాలీవుడ్‌లో ఎలాంటి సంచలన విజయం నమోదు చేసిందో చెప్పాల్సిన పనిలేదు.

తెలుగు సినిమాలు అలావుంటే, మరోపక్క కన్నడ సినిమాలు కూడా బాలీవుడ్ ని భయపెడుతున్నాయి. KGF సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా కన్నడ సినిమా పరిశ్రమని ప్రపంచ మేప్ లో నిలబెట్టింది. బాలీవుడ్లో అయితే కలెక్షన్లు సునామి సృష్టించింది. ఆ తర్వాత నిఖిల్ కార్తికేయ 2తో పాటు తాజాగా కన్నడ చిత్రం ’కాంతారా’ కూడా బాలీవుడ్‌లో దుమ్ము దులుపుతోంది. సౌత్ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ 10 స్థానంలో నిలిచింది ఈ సినిమా. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలి 2 సినిమా సౌత్ డబ్బింగ్ చిత్రాల్లో టాప్‌లో ఉంది.

అలాగే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రూ. 108.61 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సౌత్ హిందీ డబ్బింగ్ చిత్రాల్లో 7వ స్థానం అలంకరించింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజిఎఫ్’ ఛాప్టర్ 1 సినిమా హిందీలో రూ. 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో 9వ స్థానంలో ఉంది. నిఖిల్ సిద్ధార్ధ్ హీరోగా చందమూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ’ 2 సినిమా బాలీవుడ్‌లో ఇప్పటి వరకు రూ. 31.40కోట్ల నెట్ వసూళ్లను సాధించి టాప్ 10 స్థానాన్ని కైవసం చేసుకుంది.

Share post:

Latest