వంశీకి యార్లగడ్డ ట్రబుల్..రివెంజ్..!

ఉమ్మడి కృష్ణ జిల్లా గన్నవరం వైసీపీలో అంతర్గత పోరు రోజురోజుకూ ఎక్కువ అవుతుందే తగ్గట్లేదు. వైసీపీ గ్రూపు తగాదాలు అంతకంత పెరుగుతున్నాయి. పైకి మాత్రం గన్నవరం సీటు నాదే..నియోజకవర్గంలో అందరినీ కలుపుని పనిచేస్తానని వల్లభనేని వంశీ చెబుతున్నారు..కానీ లోపల మాత్రం వంశీ, యార్లగడ్డ వెంకట్రావులకు ఏ మాత్రం పడటం లేదని అర్ధమవుతుంది. గత ఎన్నికల్లో ఈ ఇద్దరు ప్రత్యర్ధులుగా తలపడిన విషయం తెలిసిందే. వంశీ టీడీపీ నుంచి, యార్లగడ్డ వైసీపీ నుంచి పోటీ పడ్డారు.

అప్పుడు చాలా తక్కువ మెజారిటీతో వంశీ గెలిచారు. గెలిచిన తర్వాత టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్లారు. దీంతో అసలు రచ్చ మొదలైంది. యార్లగడ్డ, వంశీ వర్గాలకు పడని పరిస్తితి. మధ్యలో జగన్ ఓ సారి ఈ ఇద్దరినీ కలిపారు. అయినా సరే అక్కడ పోరు ఆగడం లేదు. ముఖ్యంగా గన్నవరం సీటు విషయంలో పోరు ఉంది. సిట్టింగ్ ఉన్న వంశీ సీటు నాదే అంటున్నారు. అటు కొడాలి నాని కూడా వంశీకే సీటు అని చెప్పేశారు. అటు యార్లగడ్డ వర్గం సైతం సీటుపై ఆశలు పెట్టుకుంది.

కానీ ప్రస్తుత పరిస్తితులు చూస్తుంటే వంశీకి దాదాపు సీటు ఫిక్స్ అయినట్లే. దీంతో యార్లగడ్డ పరిస్తితి ఏంటి అనేది క్లారిటీ లేదు. ఆయన టీడీపీలోకి వెళ్ళి పోటీ చేస్తారని ప్రచారం ఉంది. ప్రస్తుతానికి మాత్రం వైసీపీలోనే ఉంటూ, వంశీపై పోరాడుతున్నారు. అయితే వంశీకి ఏ మాత్రం యార్లగడ్డ సహకరించరని అర్ధమవుతుంది. ఎందుకంటే వంశీ గెలిచినప్పుడే యార్లగడ్డ..వంశీ ఎన్నికల చెల్లదని కోర్టుకు వెళ్లారు.

ఇక తాజాగా యార్లగడ్డ వేసిన పిటిషన్‌పై తాజాగా విచారణ జరిగింది.. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం పిటిషన్ వేస్తే ఇప్పటి వరకు ప్రతివాదులకు నోటీసులు జారీ కాలేదని వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు.

2019 ఎన్నికల్లో ప్రసాదంపాడులో వంశీ అనుచరులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై కేసు కూడా నమోదైందని కోర్టుకు వివరించారు. దీంతో కోర్టు..వంశీతో పాటు గన్నవరం రిటర్నింగ్ అధికారి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు బట్టి చూస్తుంటే వంశీపై యార్లగడ్డ ఇంకా రివెంజ్ తీర్చుకోవడమే లక్ష్యంగా వెళుతున్నారని తెలుస్తోంది. ఒకే పార్టీలో ఉన్నా సరే కేసుని విత్‌డ్రా చేసుకోలేదు. మొత్తానికి వంశీని యార్లగడ్డ వదిలేలా లేరు. మరి నెక్స్ట్ వంశీకి వైసీపీ సీటు ఇస్తే..యార్లగడ్డ టీడీపీలోకి వచ్చి పోటీ చేస్తారేమో చూడాలి.