ఆ విషయంలో మహేష్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఫాలో అవుతున్నాడా?

కరోనా తరువాత టాలీవుడ్‌లో కొన్ని విషాదాలు ఛాయలు అలముకున్నాయి. కొంతమంది సీనియర్ నటులు, తమ కుటుంబాలకి చెందినవారు అకాలమరణం చెందుతున్నారు. తాజాగా రెబ‌ల్ స్టార్ కృష్ఱంరాజుతో పాటు సూప‌ర్ స్టార్ కృష్ఱ మొదటి భార్య, మ‌హేష్ బాబు త‌ల్లి అయినటువంటి ఇందిర దేవి చ‌నిపోయారు. గత నెల 11 కృష్ఱంరాజు మరణించగా, అదేనెలలో 28వ తేదీన మహేష్ బాబు తల్లి కాలం చేసారు. ప్రభాస్ తన పెదనాన్న సంస్మరణ సభను స్వగ్రామం అయినటువంటి మొగల్తూరులో ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి అందరికీ తెలిసినదే.

కృష్ఱంరాజు త‌మ్ముడి కొడుకు అయిన ప్ర‌భాస్ అన్నీ తానై ఈ కార్య‌క్ర‌మాన్ని దగ్గరుండి మరీ జయప్రదం చేయడం విశేషం. కాగా ఆ కార్యక్రమానికి దాదాపు లక్షమందికి పైగా వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో దాదాపు అభిమానులే ఉండటం గమనార్హం. కృష్ఱంరాజు, ప్రభాస్ ఇద్దరు మంచిభోజ‌న ప్రియులు కావ‌డంతో ఆయ‌న సంస్మ‌ర‌ణ స‌భ‌కు వ‌చ్చిన వారందరికీ 50 రకాలకు పైగా వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేసారు. దీని కోసం దాదాపుగా ప్రభాస్ 3 కోట్ల వరకూ ఖర్చు చేశారట.

ఇక అసలు విషయానికొస్తే, సూపర్ స్టర్ మ‌హేష్ బాబు కూడా ప్ర‌భాస్ లానే త‌ల్లి ఇందిర సంస్మ‌ర‌ణ స‌భ‌ను సొంత ఊరు అయినటువంటి బుర్రి పాలెంలో నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈనెల 16న ఈ స్మారక కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు కూడా వార్తలు వినబడుతున్నాయి. ఈ విషయం తెలిసినవాళ్ళు ప్రభాస్ మాదిరి మహేష్ కూడా ఘనంగా సదరు కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాడని అనుకుంటున్నారు. కాగా ఈ కార్యక్రమానికి కృష్ణ కుటుంబ సభ్యులంతా వ‌స్తార‌ని, ఘట్టమనేని అభిమానులకు కూడా ఆహ్వానం ప‌లుకుతార‌ని భోగట్టా.

Share post:

Latest