ఆఖరికి ఆదిపురుష్ వివాదం కోర్టుకు చేరింది… ఇపుడు ప్రభాస్, ఓం రౌత్ రియాక్షన్ చూడాలి!

ఈమధ్య కాలంలో బాగా వినబడుతున్న సినిమా పేరు ఆదిపురుష్. అవును, గత కొద్ది రోజులుగా ట్రెండ్ లో వున్న సినిమా పేరు ఇది. పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. కాగా ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల అవ్వడంతో సంక్రాతి పండగ ఓ రెండు నెలల ముందు వచ్చేసిన ఫీలింగ్ కనబడుతోంది. ఎందుకంటే డార్లింగ్ ఫాన్స్ హంగామా అంతాఇంతాకాదు. తాజాగా 3d టీజర్ థియేటర్లలో విడుదల అవ్వడంతో సినిమా రిలీజ్ చేసిన డ్రామా అక్కడ కనబడింది.

ఇక అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమా టీజర్ విడుదల అయినప్పటినుండి కొన్ని రకాల వివాదాలు మూటకట్టుకుంది. రామాయణాన్ని వక్రీకరించినట్టు ఉందని ఒకరంటే, సినిమా యానిమేషన్ లాగా ఉందని ఒకరు, రాముడు అసలు టీజర్లో కనబడలేదని ఒకరు, రావణుడిని ముస్లింలాగా చూపించారని మరికొందరు… ఇలా ఎవరికి తోచినట్టు వారు ఈ సినిమా టీజర్ పైన తమ అక్కసుని వెళ్లగక్కారు. అయితే దానికి కారణం లేకపోలేదు. టీజర్ జనాలు అనుకున్నంత బాగా లేకపోవడంతో ఇలాంటి ప్రతిస్పందనలు వచ్చాయి.

ఈ క్రమంలో కొందరైతే ఏకంగా కోర్టుకు వెళ్ళారు. అవును, ఢిల్లీకి చెందిన రాజా గౌరవ్ అనే న్యాయవాది తీస్‌ హజారి కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశాడు. ఆదిపురుష్‌ టీజర్ లో రాముని, ఆంజనేయుని అసంబద్ధంగా చూపించాలని, అలాగే రావణుడిని అవమానిస్తూ చూపించారని తన పిటిషన్లో దాఖలు చేసారు. కాబట్టి యూట్యూబ్ నుండి ఆ టీజర్ వీడియోను వెంటనే తొలగించాలని, అలాగే సినిమా విడుదలపై స్టే విధించాలని కోర్టును ఆశ్రయించాడు. కాగా దీనిపై ఇంకా విచారణ జరగాల్సి వుంది. మరి దర్శకుడితో పాటు ప్రభాస్ ని కూడా కోర్టుకి రమ్మంటారా లేదా అనేది చూడాలి.