సోషల్ మీడియాలో ఎవరూ సాధించలేని రికార్డ్… మహేష్ కు సొంతం..!

సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండియాలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ముఖ్యంగా మహేష్ బాబు ఒకరు. ఆయనకు అమ్మాయిలో విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంది. ఓవైపు సినిమాలతో మరోవైపు కమర్షియల్ యాడ్స్ తో క్షణం తీరిక లేకుండా ఉంటారు.ఇక ఇటీవలే బుల్లితెరపై సందడి చేసిన మహేష్ ఫ్యామిలీ ఆడియన్స్‏ను కూడా ఆకట్టుకున్నారు.

అయితే వరుస భారీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. కాస్త సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో సందడి చేస్తూ తన అభిమానులతో రచ్చ చేస్తూ ఉంటారు. ఆయన సోషల్ మీడియాలో పెట్టే ఒక్కో పోస్టుకు భారీ స్థాయిలో లైక్స్, షేర్స్, కామెంట్లు వస్తుంటాయి. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా ఆయన సోషల్ మీడియా వెదికగా అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా మహేష్ సోషల్ మీడియాలో అరుదైన ఘనతను సాధించారు.

మహేష్ సోషల్ మీడియాలో ఉన్న ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 13 మిలియన్లకు దగ్గర్లో ఉంది. తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం సౌత్ లోనే ఎక్కువ మంది ఫాలో అవుతున్న స్టార్ హీరోగా మహేష్ నిలిచాడు. తాజాగా దీపావళి రోజున తన కూతురు సితార క్లాసికల్ డాన్స్ చేసిన వీడియోని షేర్ చేస్తూ తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పాడు. ఆయన షేర్ చేసిన ఈ పోస్ట్ నిమిషాలలోనే ఎక్కువ లైక్స్ కామెంట్స్ షేర్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియాలో ఇలాంటి అరుదైన రికార్డ్ సాధించడంతో మ‌హేష్‌ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

Share post:

Latest