గాడ్ ఫాదర్ సినిమాపై నయనతార రియాక్షన్ ఇదే..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార ,సత్యదేవ్ కీలకమైన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు మరొక హైలెట్ గా నిలిచారని కూడా చెప్పవచ్చు. ఇక మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమాని రీమిక్స్ గా తెరకెక్కించారు. ఇక విడుదలైన మూడు రోజులకే ఈ చిత్రం రూ.100 కోట్లు మార్కును చేరువైందని సమాచారం. హైదరాబాదులో శనివారం సాయంత్రం గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు చిత్ర బృందం. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో నయనతార అభిమానులను ఉద్దేశించి ఒక స్పెషల్ నోటును షేర్ చేసింది ప్రస్తుతం ఆ విషయం గురించి తెలుసుకుందాం.

మొదట గాడ్ ఫాదర్ సినిమా నీ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి థాంక్స్ తెలియజేసింది. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం లో నయనతార చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించారు. గాడ్ ఫాదర్ సినిమాను భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు సినీ ప్రియులకు నా అభిమానులకు ధన్యవాదాలు. మీరందరూ థియేటర్లో మీ కుటుంబంతో కలిసి ఈ సినిమా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమైనదని తెలియజేసింది.

Nayanthara completes shooting for Chiranjeevi's Godfather - Hindustan Times
ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు చాలా స్పెషల్ అని తెలియజేసింది నయనతార. ముఖ్యంగా చిరంజీవి గారితో మరొకసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషమని తెలిపింది. నిరంతరము నాపై నమ్మకం ఉంచి మూడోసారి తనకు సహకారాన్ని అందించిన డైరెక్టర్ మోహన్ రాజాకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఈ చిత్రంలో సత్యప్రియ అనేది ఒక లేయార్డ్ కాంప్లెక్స్ క్యారెక్టర్ అని తెలియజేసింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు సల్మాన్ ఖాన్ ని ప్రేమిస్తారు అని తెలియజేసింది. నయనతార షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.