మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కిన స్టార్ హీరోయిన్.. దానికోసమేనా..!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు కొన్ని లక్షల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. వారిలో సామాన్య ప్రజలే కాకుండా రాజకీయ నాయకుల నుండి సినీ సెలబ్రిటీలు కూడా ఉంటారు.. విఐపి బ్రేక్ సందర్భంలో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీలు కాలినడకన తిరుపతి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇలా కాలినడక నా స్వామి వారిని దర్శించుకున్న సెలబ్రిటీలలో స్టార్ హీరోల నుండి మీడియం రేంజ్ హీరోలు కూడా ఉన్నారు. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది.. మామూలుగా సెలబ్రిటీలు నడిచి వెళ్లి దర్శించుకోవడం అనేది చాలా అరుదు.. అలాంటిది నందిని రాయ్ ఏకంగా మోకాళ్ళతో తిరుమల మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శించుకుందట.

దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో ఆ ఫోటోల కింద ‘ఇలా మెట్లు ఎక్కటం చాలా అద్భుతమైన అనుభూతి అని ఆ ఫోటోల కింద కామెంట్లు పెట్టింది’. అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యుండి మోకాళ్లతో మెట్లు ఎక్కటం ఎంతో గొప్ప విషయం… ఇలా సామాన్య భక్తులు ఎక్కువగా నడుచుకుంటూ వెళ్తారు. వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. నందిని రాయ్ హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేకపోయింది..తాజాగా వచ్చిన బిగ్ బాస్ తో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. బిగ్ బాస్ తో వచ్చిన గుర్తింపుతో నందిని రాయ్‌ బాలీవుడ్లో ఇప్పుడు పలు వెబ్ సిరీస్ లో అవకాశాలు వచ్చాయి… కొన్ని స్టార్ హీరోల సినిమాలలో నటిస్తుంది. అయితే ఇప్పుడు తన మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల వచ్చిందని తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Nandini Rai (@nandini.rai)

Share post:

Latest