ఆ హీరోని డైరెక్ట్గా చూడాలంటే భయమంటున్న హీరోయిన్ ప్రేమ..!!

టాలీవుడ్లో స్టార్ హీరో మోహన్ బాబు కు ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్లో స్టార్ హీరోలతో గట్టి పోటీ ఇచ్చి తన చిత్రాలను విడుదల చేసేవారు. క్రమశిక్షణకు మారుపేరు అన్నట్లుగా మోహన్ బాబు వ్యవహరిస్తూ ఉంటారు. ఆయనతో షూటింగ్ అంటే కాస్త టెన్షన్ గా ఉంటుందని కొంతమంది డైరెక్టర్లు, నిర్మాతలు సైతం తెలియజేస్తూ ఉంటారు. ఏదైనా షార్ట్ సరిగ్గా రాకుంటే తిడతారు అనే వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తూ ఉండేవి. ఇక అనుకున్న విధంగా నటించకుంటే నటీనటులను సైతం తిడతారు అనే వార్తలు వినిపిస్తూ ఉండేవి.

Prema (Actress) Age, Height,Net Worth & Bio - CelebrityHow

సెట్లో కాస్త జోషుగా అనిపించిన కోపంగా ఉంటారని ఎంతోమంది మోహన్ బాబు గురించి మాట్లాడుతూ ఉంటారు. సీనియర్ హీరోయిన్ ప్రేమ కూడా మోహన్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ప్రేమ చాలాకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది. అయితే ప్రేమ అనుకోని ప్రయాణం చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ప్రేమ మాట్లాడుతూ మోహన్ బాబు పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రేమ మాట్లాడుతూ తెలుగులో నాకు రామానాయుడు గారు ధర్మచక్రం సినిమాలో అవకాశం ఇచ్చారని తెలిపింది.

Happy Birthday Mohan Babu: 5 films that made him the 'Dialogue King' |  Entertainment News,The Indian Express

ఆ తర్వాత మోహన్ బాబు గారితో రాయలసీమ రామన్న చౌదరి చిత్రంలో నటించాను ఆ చిత్రంలో నటించే సమయంలో తనకు చాలా భయం వేసిందని మోహన్ బాబు గురించి అంతకుముందు ఎన్నో విషయాలు విని ఆయనతో చేయడానికి భయపడ్డాను తెలిపింది. అందుచేతనే మోహన్ బాబు గారితో నటించడం అంటే కష్టమని నెగటివ్ స్టేట్స్ ఉన్న పాత్రలో నటించడం మరి కష్టమని తెలియజేసింది. ఆయన్ని డైరెక్ట్ గా చూడాలంటే చాలా భయం వేసేది అని తెలిపింది ప్రేమ.