వైసీపీ లెక్క..ఆ ఐదు జిల్లాల్లో టీడీపీకి ఊపు.!

అసలు ఎప్పటికప్పుడు ప్రతిపక్ష టీడీపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన జగన్..ఆ తర్వాత కూడా టీడీపీ ఏ మాత్రం బలపడకుండా..తనదైన శైలిలో రాజకీయం చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం పరంగా ప్రజలకు పథకాలు ఒకటి ఇస్తున్నారు..అంతే ప్రజలకు సంబంధించి మిగతా పనులు ఏం చేస్తున్నారో క్లారిటీ లేదు గాని..టీడీపీని దెబ్బతీయడానికి మాత్రం శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు.

వైసీపీలో మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తకు టీడీపీని అంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే వైసీపీ అనుకున్న విధంగా టీడీపీని దెబ్బతీయగలిగారా? 2019 ఎన్నికల కంటే టీడీపీ పరిస్తితి దిగజారిందా? అంటే ఇంకా మెరుగు పడిందే తప్ప..దిగజారిపోలేదు అని చెప్పొచ్చు. వైసీపీ చేస్తున్న కొన్ని పనులే టీడీపీ బలపడటానికి కారణమయ్యాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. అందుకే నిదానంగా టీడీపీ బలం పెరుగుతూ వచ్చింది.

ప్రస్తుతం వైసీపీని దాటే బలం టీడీపీకి రాలేదు..గాని వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే బలం మాత్రం వచ్చిందని తెలుస్తోంది. ఆ విషయం వైసీపీ అంతర్గత సర్వేల్లోనే తేలిందట. ఇటీవల వైసీపీలో కొన్ని అంతర్గత సర్వేలు వచ్చాయట. ఆ సర్వేల్లో ఊహించని విధంగా కొన్ని జిల్లాల్లో టీడీపీ బలం పెరిగిందని తెలిసింది. ఆ జిల్లాలు కూడా ఎవరు ఊహించని విధంగా ఉన్నాయి.

మొత్తం ఐదు జిల్లాల్లో టీడీపీ గ్రాఫ్ బాగా పెరుగుతుందట. ఉమ్మడి జిల్లాల ప్రకారం చూసుకుంటే అనంతపురం, ప్రకాశం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం..ఈ ఐదు జిల్లాలో టీడీపీకి ఊహించని విధంగా బలం పెరుగుతుందని వైసీపీ అంతర్గత సర్వేల్లో తేలిందట. వీటిల్లో ఉత్తరాంధ్రకు చెందిన విశాఖ, శ్రీకాకుళం జిల్లాలు ఉండటం విశేషం. అలాగే రాజధాని అమరావతి ప్రభావం కృష్ణా-గుంటూరు జిల్లాల్లో వైసీపీకి మైనస్ అవుతుందట. ఇక ఈ రెండు చోట్ల టీడీపీ-వైసీపీల మధ్య టఫ్ ఫైట్ ఉందని తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం గట్టిగా ఉందని తేలింది. ఒకవేళ టీడీపీ-జనసేన కలిస్తే తూర్పులో వైసీపీకి పెద్ద దెబ్బ. మొత్తానికి వైసీపీకి కష్టాలు నిదానంగా పెరిగేలా ఉన్నాయి.