టి20 వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 23న జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ గా నరాలు తెగే రీతిలో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. టి20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ తోనే శుభారంభం చేసింది భారత్. ఈ మెగా టోర్నీలో భాగంగా గ్రూప్ 2 లో పోటీపడుతున్న టీమిండియా మరో నాలుగు మ్యాచ్లు ఆడనుంది.
భారత్ ఆడబోయే టీమ్‌లు చూస్తే నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే ఈ నాలుగు టీమ్స్ తో భారత్ ఆడాల్సి ఉంది. ఈ నాలుగు టీమ్ లో చెప్పుకోదగ్గ పోటీ ఇచ్చే టీమ్‌లు మాత్రం రెండే ఉన్నాయి బంగ్లాదేశ్ ,సౌత్ ఆఫ్రికా.. ఈ రకంగా చూసుకుంటే భారత్ కచ్చితంగా సెమీ ఫైనల్ కు చెరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గ్రూప్ 2లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లులు జరిగాయి. వాటిలో పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం సాధించగా.. నెదర్లాండ్స్ పై బంగ్లాదేశ్ విజయం సాధించగా… జింబాబ్వే- సౌత్ ఆఫ్రికా జెట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం తేలకుండా మధ్యలో ఆగిపోయింది. గ్రూప్ 2లో కచ్చితంగా సెమీస్ కు వెళ్లే జట్టులో పాకిస్తాన్ ఒకటి . మొన్న జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్- భారత్ చేతిలో ఓడిపోయింది. ఇక దీంతో భారత్‌కు పోటీ ఇచ్చే టీమ్ ఏదీ లేదు. అందరూ అనుకునే విధంగా భారత్ సెమిస్ కి వెళ్తుంది. టి20 వరల్డ్ కప్ కూడా భారత్ కి వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈసారి కప్పు ఎవరిని వరిస్తుందో తెలియాలంటే చివరి మ్యాచ్ వరకు ఆగాల్సిందే..!