తమిళ్ లో శింబు..తెలుగు రానా.. దొందు దొందే..!!

కోలీవుడ్ స్టార్ శింబు హీరోగా వచ్చిన మహానాడు సినిమా మంచి హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాను వెంకట్ ప్రభు క్రేజీ టైం లుప్ కాన్సెప్ట్ లో ఎంతో థ్రిల్ంగ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సురేష్ బాబు సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తెలుగు కథకు సంబంధించిన వర్కును హరి శంకర్- దశరథ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసారు.

Maanaadu Official Tamil Trailer | STR | SJ Suryah | Kalyani | Venkat Prabhu  | YSR | V House - YouTube

 

మొన్నటి వరకు ఈ సినిమాని హరి శంకర్ దర్శకత్వంవం వహిస్తారని సోషల్ మీడియాలో టాక్ నడిచింది. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ఈ సినిమాను హరిశంకర్- దశరథ్ కాకుండా మరో కొత్త దర్శకుడు పట్టాలెక్కిస్తున్నాడని తెలుస్తుంది.

Rana Daggubati to play a vampire in thriller directed by Milind Rau | The  News Minute

అలాగే ఈ సినిమా హీరో విషయంలో మొన్నటి వరకు ఇందులో రవితేజ హీరోగా నటిస్తున్నాడని సినీ వర్గాల్లో టాక్ నడిచింది. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోగా రానా చేస్తే బాగుంటుందని సురేష్ బాబు భావిస్తున్నాడట. రానా సోలో హీరోగా చేసి చాలాకాలం అయింది. ఈ వైవిధ్యమైన కథలో రానా హీరోగా నటిస్తే అతనికి బాగుంటుందని సురేష్ బాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. త‌మిళ్‌లో ఈ సినిమాలో విలన్ గా ఎస్ జే సూర్య ఎంతో వైవిధ్యంగా నటించాడు. ఇప్పుడు తెలుగులో విలన్ గా ఎవరు నటిస్తారనే దానిపై కూడా అన్వేషణ జరుగుతుంది. అంతా కుదిరితే ఆ పాత్రికి తమిళ్‌లో చేసిన ఎస్ జే సూర్య నటిస్తారని టాక్ కూడా నడుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన వస్తుందని తెలుస్తుంది.