40లో కూడా తన అందంతో కుర్రకారుని రెచ్చగొడుతున్న హీరోయిన్ శ్రియ!

నిన్నటి అందాల హీరోయిన్ శ్రియ గురించి తెలియని వారు ఉండరనే చెప్పుకోవాలి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ తరగని అందగత్తెలలో శ్రియ ముందువరుసలో ఉంటుంది. ఆమె తెలుగు పరిశ్రమకి వచ్చి దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. మొదట 15 ఏళ్లు ఆమె టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ప్లేసులో కొనసాగింది. ఇప్పుడు కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ సినిమా ప్రేక్షకులను పలకరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో యంగ్ స్టార్స్, సీనియర్ స్టర్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రియ.

ఇకపోతే పిల్లలు పుట్టిన తరువాత కూడా అమ్మడు అదే బ్యూటీని మెయింటేన్ చేయడం అంటే సవాలుతో కూడుకొన్నది. నిన్నటికి నిన్న ‘నువ్వే నువ్వే’ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హీరోయిన్ శ్రియని చూసినవారు కొత్త సినిమాకి బుక్ చేసిన కొత్త హీరోయిన్ లా వుందే? అనుమానం వచ్చేలా వుంది ఆమె అందం. ఏళ్ళు గడుస్తున్నా తరగని అందం ఆమెది. అందుకే ఇప్పటికీ పలు భాషల్లో సినిమా అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వస్తున్నాయి.

ఆమె బాలీవుడ్లో నటించిన ‘దృశ్యం 2’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈమధ్య ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది. తరచుగా తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కు కునుకులేకుండా చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూస్తే మీరు మైమరచిపోతారు. శ్రీయా 40 ప్లస్ ఏజ్ లో కూడా కుర్ర కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది అంటే మెచ్చుకొని తీరాలసిందే. తన ఫిజిక్, ఫిట్ నెస్ తో పాటు.. బ్యూటీతో ఆమె నవతరం హీరోయిన్లకు సైతం సవాలు విసురుతోంది.