RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సెలబ్రేటిస్ సైతం బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు గొప్ప వీరులను కలిపి ఒక ఫిక్షనల్ కధతో ఎంత అద్భుతంగా సినిమాని కెరకెక్కించేచారు డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ,అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించి మెప్పించారు. అయితే అసలు జరిగిన దానికి ఈ సినిమా కథ పూర్తి డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడ కూడా వివాదానికి దారి ఇవ్వకుండా ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు రాజమౌళి.
దీంతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ప్రశంసలు అందుకుంది. తెలుగులో పాటు ఇండియా వైడ్ గా ఈ సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ చిత్రం తాజాగా జపాన్లో విడుదల చేయడం జరిగింది.ఇప్పటికె రామ్ చరణ్ ,ఎన్టీఆర్ జపాన్ కు చేరుకొని అక్కడ ప్రమోషన్ పనులను చేశారు. జపాన్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పడం జరిగింది అక్కడ అభిమానులు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే RRR సినిమా జపాన్ లో విడుదలై అక్కడ కూడా భారీగానే రెస్పాన్స్ లభించింది.
జపాన్లో RRR చిత్రం విడుదలై మొదటి రోజు ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు రాబట్టిందో అంటూ అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది క్రిటిక్స్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ చిత్రం అక్కడ ఏకంగా రూ.25 కోట్ల రూపాయలు కలెక్షన్స్ సాధించినట్లు టాక్ వినిపిస్తోంది. ఆర్ ఆర్ అర్ సినిమా విడుదలై దాదాపుగా ఏడు నెలల కావస్తున్నప్పటికీ ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.