హాట్ టాపిక్ గా మారిన పూరీ లెటర్.. ఎవరిని మోసం చేయలేదంటూ..?

టాలీవుడ్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మధ్యకాలంలో అంతగా ఆకట్టుకోలేకపోతుండని చెప్పవచ్చు. ముఖ్యంగా లైగర్ సినిమా విజయ్ దేవరకొండ తో తెరకెక్కించి భారీ డిజాస్టర్ని చవిచూశారు. దీంతో ఈ సినిమాని కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సైతం నష్టపరిహారం కింద ఎంతో కొంత ఇవ్వాలని పూరి జగన్నాథ్ ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పూరి జగన్నాథ్ తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం. దీంతో ఈ విషయం మరింత వైరల్ గా మారడంతో తాజాగా పూరి జగన్నాథ్ ఈ విషయంపై ఒక లెటర్ రాయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

Image

పూరి జగన్నాథ్ ఇలా రాసుకుంటూ.. సక్సెస్ ఫెయిల్యూర్ ఈ రెండు వ్యతిరేకం అనుకుంటాము కానీ ఇందులో నిజం లేదు.. రెండు ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తూ ఉంటాయని పూరి జగన్నాథ్ లేఖలో రాసుకొచ్చారు. ముఖ్యంగా మన లైఫ్ లో ఏదీ శాశ్వతం కాద.. లైఫ్ లో మనకి జరిగే ప్రతి సంఘటన కూడా ఒక అనుభవం తప్ప ఫెయిల్యూర్ సక్సెస్ లా చూడకూడదని తెలిపారు. అందుకే లైఫ్ ని సినిమాలా చూస్తే షో అయిపోగానే మర్చిపోవచ్చు మైండ్ కు తీసుకుంటే మెంటల్ వస్తుంది అని తనదైన శైలిలో లైఫ్ అంటే ఏంటో తెలియజేశారు.

Puri Jagannadh facing the heat of Liger
సక్సెస్ లో డబ్బులు వస్తాయి.. ఫెయిల్లో జ్ఞానం వస్తుంది. నా లైఫ్ లో బ్యాడ్ జరిగితే మన చుట్టూ ఉన్న బ్యాడ్ పీపుల్స్ మాయమైపోతారు. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుంది.. లైఫ్ లో నువ్వు హీరో అయితే సినిమాలలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ కూడా జరుగుతాయి. పొగుడుతారు, నిందిస్తారు, అందరూ క్లాప్స్ కొడతారు, అక్షింతలు వేస్తారు కాబట్టి మీ లైఫ్ లో జరగకపోతే జరిగేలా చూడండి.. బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి నేను నిజాయితీపరుడని చెప్పుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. నేను ఎప్పుడైనా మోసం చేస్తే దగా చేస్తే అది నన్ను నమ్మి సినిమా టికెట్ కొన్న ఆడియన్స్ను తప్ప నేను ఎవరిని మోసం చేయలేదు. వాస్తవానికి నేను నా ప్రేక్షకులకు బాధ్యత వహిస్తాను మళ్ళీ ఇంకో సినిమా తీసి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తా.. ఇక డబ్బు అంటారా చచ్చినా కూడా ఇక్కడి నుండి ఒక రూపాయి తీసుకువెళ్లిన ఒకరీ పేరు నాకు చెప్పండి అంటూ తెలియజేశారు.

https://twitter.com/idlebraindotcom/status/1586591933249785856?s=20&t=DO5-P-9w3XHicsYg-XVobw