బాబు లెక్కలు..మ్యాజిక్ ఫిగర్ రావట్లేదా?

నెక్స్ట్ ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో టీడీపీ అధినేత చంద్రబాబు పని చేస్తున్నారు..ఈ సారి కూడా అధికారంలోకి రాకపోతే పార్టీ పరిస్తితి ఏం అవుతుందో బాబుకు తెలుసు. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే టీడీపీ సంగతి అంతే. కాబట్టి మళ్ళీ జగన్‌కు ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలని చెప్పి బాబు..టీడీపీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అయితే వైసీపీపై వ్యతిరేకత బాగా ఉందని, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువ ఉందని, ఇక ప్రజలు తమ వైపు ఉంటారనే ధీమా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది.

ఖచ్చితంగా ఈ సారి అధికారంలోకి వచ్చేస్తామని భావిస్తున్నారు..కానీ ఈ విషయంలో చంద్రబాబు కాస్త సందిగ్ధంలోనే ఉన్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు టీడీపీ ఇంచార్జ్‌లతో భేటీ అవుతూ..వారికి గట్టిగానే క్లాస్ ఇస్తున్నారు. నియోజకవర్గాల్లో యాక్టివ్ గా పనిచేయకపోతే పక్కన పెట్టేస్తామని క్లారిటీగా వార్నింగ్ ఇస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చే విషయంలో బాబు ఇంకా డౌట్ తోనే ఉన్నారని అర్ధమవుతుంది.

ఎందుకంటే కొందరు టీడీపీ నేతలు ఇప్పటికీ ఎఫెక్టివ్‌గా పనిచేయడంలో వెనుకబడి ఉన్నారు. నిజానికి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. కానీ ఆ వ్యతిరేకతని టీడీపీ నేతలు యూజ్ చేసుకోవడం లేదు. దీని వల్ల పార్టీ బలపడటం లేదు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఇదే పరిస్తితి కనిపిస్తోంది. ఇటు నెల్లూరు, గుంటూరు, కృష్ణా లాంటి జిల్లాల్లో అదే పరిస్తితి. దీంతో టీడీపీ గెలుపుకు కాస్త దూరంగానే ఉందని తెలుస్తోంది.

అందుకే బాబు టీడీపీ ఇంచార్జ్‌లని ఎప్పటికప్పుడు మందలిస్తూనే ఉన్నారు. దూకుడుగా పనిచేయాలని సూచిస్తున్నారు. ఇక బాబు లెక్కల ప్రకారం..టీడీపీ సింగిల్‌గా 50-60 సీట్లు మాత్రమే గ్యారెంటీగా గెలుచుకునే బలం ఉందని తేలిందట. అంటే ఇది ఇప్పుడున్న పరిస్తితి బట్టి. ఈ పరిస్తితిని ఎన్నికల నాటికి మార్చాలనేది బాబు ప్లాన్‌గా ఉంది. ఆ ఉద్దేశంతోనే ఇంచార్జ్‌లకు వార్నింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఎన్నికల నాటికి టీడీపీ పరిస్తితి మెరుగు అవుతుందో లేదో.