అలాంటి సీన్స్ చేసే హీరోయిన్లే దొరకట్లేదు.. ‘ది ఘోస్ట్’ డైరెక్టర్ సంచలన కామెంట్స్..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి కొదవలేదు . బోలెడు మంది హీరోయిన్స్ ఉన్నారు. అయినా సరిపోదు అన్నట్టు రోజుకో కొత్త హీరోయిన్ తెరపైకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. వీళ్ళల్లో సక్సెస్ కొట్టే హీరోయిన్స్ చాలా తక్కువ తెరపైకి 50 మంది హీరోయిన్లు అడుగుపెడుతుంటే వాళ్ళల్లో పట్టుమంటే స్టార్ హీరోయిన్ లిస్టులోకి వెళ్తున్న ముద్దుగుమ్మలు ముగ్గురు కూడా ఉండట్లేదు. అంతలా దారుణమైన సిచువేషన్ ఎదుర్కొంటుంది సినీ ఇండస్ట్రీ. అయితే ఇంతమంది హీరోయిన్స్ ఉన్న ఇండస్ట్రీలో అలాంటి సీన్స్ చేయడానికి మాత్రం ఏ హీరోయిన్ ముందుకు రావట్లేదట. ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పి డైరెక్టర్ నెట్టింట హాట్ టాపిక్ గా మారారు.

ప్రవీణ్ సత్తారు ఈ పేరుకు కొత్త పరిచయాల అవసరం లేదు. ఇప్పటికే ‘ది ఘోస్ట్’ సినిమా పుణ్యమా అంటూ ఆయన పేరు సోషల్ మీడియాలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రూపుదిద్దుకున్న భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ “ది ఘోస్ట్”. ఈ మూవీపై బోలెడన్ని అంచనాలు పెట్టుకొని ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్ .అంతేకాదు అక్కినేని హీరో 100 కోట్లు క్రాస్ చేయాలన్న కోరికను ఈ సినిమా కచ్చితంగా తీర్చేస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేశారు “ది ఘోస్ట్’ టీం. ఇందులో భాగంగానే మూవీ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఓ ప్రముఖ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం ఎంతమంది హీరోయిన్స్ ని అప్రోచ్ అయ్యారో.. వాళ్ళందరూ ఎందుకు రిజెక్ట్ చేసారో కూడా చెప్పి షాక్ ఇచ్చారు. ‘ది ఘోస్ట్’ చిత్రం ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం గా రూపుదిద్దుకుంది. ఈ సంగతి అందరికీ తెలిసిందే .

అయితే ఈ సినిమాలో హీరోయిన్గా సోనాలి చౌహాన్ నటిస్తుంది. ఈ అమ్మడుని హీరోయిన్గా సెలెక్ట్ చేసే ముందు ప్రవీణ్ సత్తార్ దాదాపు పది పన్నెండు మంది హీరోయిన్స్ ను వెతికారట. అయిన ఏ హీరోయిన్ కూడా యాక్షన్ సీన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూయించలేదట. కేవలం సోనాలి చౌహాన్ మాత్రమే యాక్షన్ సీన్స్ అంటే ఇష్టపడి సినిమాను ఇష్టంగా చేసింది అని ఆయన చెప్పుకోరావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఇప్పటికీ యాక్షన్స్ సీన్స్ చేసే హీరోయిన్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డాడు. ఫస్ట్ కాజల్ అనుకున్న ఆ తర్వాత ఆమె సినిమా నుండి తప్పుకోవడంతో శృతిహాసన్, అమలాపాల్ ,చాలా మందిని అప్రోచ్ అయ్యారట. కానీ ఎవ్వరు కూడా యాక్షన్ సీన్స్ చేసే దానికి ఇష్టపడలేదట . ఫైనల్ గా ఆ అవకాశం దక్కించుకుంది సోనాలి చౌహాన్. మరి చూడాలి ఈ సినిమా ద్వారా సోనాలి చౌహాన్ తెలుగులో ఎలాంటి పాపులారిటీ దక్కించుకుంటుందో..? నాగార్జున ఖాతాలో ఎలాంటి హిట్ పడుతుందో..?

Share post:

Latest