నాగబాబు ఆస్తి విలువ ఎన్ని కోట్లంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ గా నటుడుగా, నిర్మాతగా, పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక తన సొంత బ్యానర్ మీద ఆరెంజ్ సినిమాని నిర్మించి భారీ నష్టాలను మిగిల్చుకున్నారు.నాగబాబు నిర్మాణానికి ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ తన కొడుకు వరుణ్ తేజ్ మాత్రం సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇక తన కొడుకు నటించబోయే ఒక సినిమా తో నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు నాగబాబు ఆస్తులు విలువ ఒకసారి మనం తెలుసుకుందాం.

Naga Babu's move sparks rumours again
జబర్దస్త్ తో పాటు పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు ఆస్తులు విలువ గత కొన్నేళ్లుగా భారీగా పెరిగిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ విలువల ప్రకారం నాగబాబు ఆస్తి విలువ రూ.120 కోట్ల రూపాయలకంటే ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు సమాచారం. ఇక కుమారుడు వరుణ్ తేజ్ కూడా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంటూ ఒక చిత్రానికి రూ.10 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక గత ఏడాది విడుదలైన గని సినిమా డిజాస్టర్ కాగా..F-3 సినిమా మాత్రం బాగా సక్సెస్ అందుకుంది.

Niharika Konidela's Father, Naga Babu On Her Detainment By Police, Says  'She Has Done Nothing Wrong'
ఇక ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సర్కారు వారి పాట చిత్రంలో నాగబాబు చిన్న పాత్రలో నటించి మెప్పించారు. ఇక నాగబాబుకు పాత్ర నచ్చితే ఇతర హీరోల సినిమాలలో కూడా నటించడానికి సిద్ధమే అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాగబాబు రోజుకు ఒక్కో చిత్రానికి రూ.4.5 లక్షల రూపాయలు తీసుకోబోతున్నట్లు సమాచారం. నాగబాబు హీరోగా కంటే పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు గాని మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం నాగబాబుకు సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest