కోట్ల విలువగల ఆస్థులు మహేష్ బాబు తల్లి వేరేవాళ్లకి రాసేసిందా?

ఈమధ్య కాలంలో మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినవాళ్లు వరుసగా కాలం చేయడం ఒకింత దిగ్బ్రాంతికి చెందిన విషయమే. కాగా తాజాగా సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి అయినటువంటి ఇందిరా దేవి స్వర్గస్తులైన విషయం అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రొఫెషనల్ లైఫ్ పక్కనపెడితే ఆయన పర్సనల్ లైఫ్ విషయంలోకి వస్తే అతగాడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు. అందులో మొదటగా తన మరదలు అయిన ఇందిరా దేవిని కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

వీరి పెళ్లి అయిన కొన్ని సంవత్సరాలకే మళ్ళీ విజయనిర్మలతో ప్రేమలో పడి ఆమెను కూడా రెండో వివాహం చేసుకున్నారు. ఇక వీరి ప్రేమ విషయం తెలిసి ఇందిరా దేవి కూడా అడ్డు చెప్పలేదట. అంతేకాదు మీరు రెండో పెళ్లి చేసుకున్నా కూడా మీకు నేను భార్యగానే కొనసాగుతానని కృష్ణ దగ్గర మాట తీసుకుందట. ఇక తాజాగా ఇందిరాదేవి అనారోగ్యం కారణంగా కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇందిరాదేవి మరణించాక ఆమె గురించి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ నేపథ్యంలో ఇందిరా దేవి గారికి ఉన్న కోట్ల ఆస్తుల గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

అవును, ఇందిరా దేవికి వివాహం చేసుకున్నాక తన తల్లి పేరు మీద వారసత్వపు ఆస్తులు వచ్చాయట. అయితే వారసత్వంగా వచ్చిన తన ఆస్తులన్నింటిని ఇందిరాదేవి ముందుగా కృష్ణకే అప్ప జెప్పిందట. అయితే ఇందిరా దేవికి తన పిల్లలంటే చెప్పలేనంత ఇష్టం. వారికి ఏ లోటు లేకుండా ఎంతో ప్రేమగా చూసుకునేది. అయితే పిల్లల మీద ఉన్న ప్రేమతో తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులన్నింటినీ ఇందిరాదేవి తన కూతుర్ల పేరు మీద రాయాలని నిర్ణయించుకుందట. అంతే కాదు తన కూతుర్ల తర్వాత వారి కూతుర్లకు ఆస్తి చెందాలని ఇందిరా దేవి వీలునామా రాసిందట.

Share post:

Latest