కాంతారా ఓటీటి సినిమా క్యాన్సిల్.. కారణం ఏమిటంటే..!!

ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర హవా కొనసాగిస్తున్న సినిమాలలో కాంతార సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ను అందుకుంది. కేవలం కనడ లోనే మొదట విడుదలైన ఈ చిత్రం ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇక సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా పైన పలువురు ప్రేక్షకులు సినీ ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో హీరోగా రిషబ్ శెట్టి స్వయంగా ఈ చిత్రంనే దర్శకత్వం వహించారు.

കാന്താര ഒടിടിയിലേക്ക്? പ്രതികരണവുമായി നിര്‍മാതാവ് | Kantara OTT Release  Date and Time
ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. తాజాగా ఈ సినిమాను చూసిన రజనీకాంత్ సైతం పొగడ్తల వర్షం కురిపించారు. ఇప్పటివరకు ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్ల కు పైగ రాబట్టింది. ఈ సినిమా ఓటీటి లో ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ సినీ అభిమానులు సైతం ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తున్నారు. అయితే అలా ఎదురు చూస్తున్న సినీ ప్రియులకు ఈ సినిమా ఓటీటి ప్లాట్ ఫామ్ అమెజాన్ లో నవంబర్ 4వ తేదీన విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి..

Kantara Kannada Movie OTT Release Date - Digital Rights | Watch Online - OTT  Raja

ఈ సినిమా ఓటిటి రైట్స్ ను భారీ ధరకే విక్రయించినట్లుగా సమాచారం. అయితే ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతూ ఉన్న సమయంలో ఈ సినిమా ఓటీటి లో విడుదలైతే కలెక్షన్ల పైన ఎఫెక్ట్ చూపిస్తుందని.. చిత్ర బృందం భావించి ఈ సినిమాని ఓటీటి లో విడుదల చేయకూడదని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఈ సినిమా ఓటిటి డీల్ క్యాన్సిల్ అయింది అని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో చూడాలి.

Share post:

Latest