‘కాంతార’ డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే..షాక్ అయిపోతారు..పేరుకూడా అబ్బధమే..!!

కాంతారా సినిమా ఇప్పుడు అన్ని సినిమా ఇండస్ట్రీలని ఒక ఊపు ఊపేస్తుంది. ఏ ఇండస్ట్రీలో చూసిన కాంతారా సినిమా పేరు మారుమ్రోగితుంది. ఒక చిన్న సినిమాగా కన్న‌డలో విడుదలైన ఈ సినిమా అక్కడ వారం రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టుకుంది. తర్వాత ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో విడుదల చేశారు. విడుదలైన ప్రతి భాషలోను ఈ సినిమా సూపర్ హిట్ తో భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాని తెరకెక్కించి నటించిన రిషబ్ శెట్టి పేరు పాన్ ఇండియా లెవెల్ లో వైరల్ గా మారింది. ఆయనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ అవుతున్నాయి. ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Kantara' is a realistic, rooted story albeit with elements of fantasy that  I have personally felt: Rishab Shetty | Kannada Movie News - Times of India

ఈయన అసలు పేరు రిషబ్ శెట్టి కాదట భాస్కర్ శెట్టి. ఆయన సినిమా పరిశ్రమంలోకి ఎంట్రీ ఇచ్చాక ఆయన పేరును రిషబ్ శెట్టిగా మార్చుకున్నారు. అయ‌న‌ తన కెరియర్ మొదటిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన సీరియల్స్ లో కూడా నటిస్తూ తన కెరీర్ ని మొదలుపెట్టారు. కన్నడలో పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వచ్చిన కొన్ని సినిమాలకు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రిషబ్ శెట్టి 2017లో ప్రగతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.

Here's what Rishab Shetty has to say about Kantara 2 | Entertainment  News,The Indian Express

ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతారా సూపర్ హిట్ అవడంతో ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన తర్వాత సినిమాలు గురించి కూడా చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన తెలుగులో రామ్ చరణ్‌లో ఓ సినిమా చేయబోతున్నాడని కూడా సోషల్ మీడియాలో వార్తలు వ‌స్తున్నాయి.