ఏ సినీ ఇండస్ట్రీలో నైనా నటీ నటీమణుల మధ్య ప్రేమ వ్యవహారాలు ఉండనే ఉంటాయి. కొంతమంది ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్తారు. మరికొంతమంది మధ్యలోనే బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఇప్పటివరకు ఎన్నో జంటలని మనం చూసే ఉన్నాము. గత కొద్ది రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు కాంతారా. ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బాస్టర్ విజయం గా నిలిచింది. దీంతో ఈ సినిమా విడుదలైన ప్రతి చోట కూడా భారీగానే కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ చిత్రంలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి ఈ చిత్రానికి డైరెక్షన్ కూడా ఆయనే వహించారు.
దీంతో రిషబ్ శెట్టి కుటుంబం గురించి అభిమానులు సైతం ఆరా తీయడం జరిగింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలు కూడా వెళ్ళబడ్డాయి. ముఖ్యంగా రిషబ్ శెట్టి వివాహం గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ నటుడు ప్రేమించి వివాహం చేసుకున్నారని అందుకు సంబంధించి విషయాలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా రిషబ్ శెట్టి భార్య ప్రగతి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైందట. ఆ పరిచయం కాస్త కొద్ది రోజుల్లోకు ప్రేమగా మారిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
అయితే వీరి ప్రేమ వ్యవహారాన్ని మాత్రం ప్రగతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో పట్టుబడి ఒప్పించి రిషబ్ శెట్టిని వివాహం చేసుకుందట. అలా వీరిద్దరూ పెద్దలను ఒప్పించి మరి 2017లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాంతార చిత్రంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా పేరుపొందిన రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈ నటుడుకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.