ఎన్టీఆర్ సినిమా పాన్ ఇండియా కాదా.. సౌత్ ఇండియాకే పరిమితమా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికి ఈ సినిమా పైన కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా పలు రూమర్స్ చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే విషయంలో అటు హీరోయిన్ విషయంలో పలు రూమర్స్ వెలుబడుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే చిత్ర బృందం మాత్రం ఈ రూమర్స్ కు ఎలాంటి బ్రేక్ వేయలేదు. ఇక ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా తెలపలేదని చెప్పవచ్చు.

Jr NTR and Koratala Siva's NTR30 delayed due to Acharya's failure? - Movies  News
ఇప్పుడు తాజాగా మళ్లీ హీరోయిన్ విషయంలో మరొక వార్త వైరల్ గా మారుతోంది అదేమిటంటే బాలీవుడ్ హీరోయిన్ కోసం పలు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకొని సౌత్ హీరోయిన్ కి ఫిక్స్ అయినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ ఎవరు ఈ సినిమాలో నటించేందుకు ముందుకు రాలేకపోవడంతో పాటు.. రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎక్కువగా అడగడంతో సౌత్ హీరోయిన్ కి ఈ చిత్రంలో అవకాశాన్ని ఇచ్చే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.

ఎన్టీఆర్‌ సరసన కీర్తి సురేష్‌.. క్రేజీ పెయిర్‌ని సెట్‌ చేస్తోన్న మాటల  మాంత్రికుడు..! | Keerthy suresh in jr ntr and trivikram srinivas film | TV9  Telugu
ముందుగా ఈ సినిమాలో ఆలియా భట్ నటిస్తుందనుకున్నారు.. కానీ పలు కారణాల వల్ల ఆమె నటించలేదు ఇక ఆ తర్వాత రష్మిక, మృణాల్ ఠాగూర్, జాన్వి కపూర్ తదితర పేర్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా సౌత్ హీరోయిన్ ఆయన మహానటి హీరోయిన్ ఈ సినిమాలో నటించబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఈమె ప్రాధాన్యత చాలానే ఉంటుందని ముఖ్యంగా నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండడం చేత కీర్తి సురేష్ కూడా ఈ సినిమాని ఒప్పుకునే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఇక అంతే కాకుండా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో కాకోకుండా కేవలం సౌత్ ఇండియాలోనే ఈ సినిమాని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. మరి అన్ని విషయాలకు చిత్ర బృందం ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

Share post:

Latest