ఇదెక్కడి దారుణం.. ఇంత గొప్ప నటుడిని గాడ్ ఫాదర్ లో ఎవరు గుర్తుపట్టలేదే..!!

మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా హీరోగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్.. ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ సినిమాకి తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో నయనతార , మురళీ శర్మ, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ తదితరులు ప్రత్యేక పాత్రలో నటించారు. చిరంజీవి, నయనతార ల తండ్రి పాత్రలో నటించిన నటుడిని మాత్రం చాలా మంది తెలుగు ప్రేక్షకులు గుర్తించలేదు ఆయనే సర్వదామన్ బెనర్జీ. చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు తెరపై ఆయన వేసిన ముద్ర మామూలుది కాదు. 80వ దశకంలో అమ్మాయిల డ్రీమ్ బాయ్ అయిన ఆయన దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ తీసిన సిరివెన్నెల సినిమాలో హీరోగా నటించారు.

Here's how Sarvadaman D. Banerjee looks now

కళాతపస్వి కే విశ్వనాథ దర్శకత్వంలో 1986లో వచ్చిన సిరివెన్నెల సినిమా ద్వారా అంధుడైన సంగీత కారుడు, మూగ పెయింటర్, వేశ్య అయిన మరో అమ్మాయి కథతో అదిరిపోయే పాటలతో ఈ సినిమా తెలుగు ఆల్ టైం క్లాసిక్ హిట్లలో ఒకటిగా నిలిచింది.. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు విధాత తలపున, చందమామ రావే జాబిల్లి రావే, ఈ గాలి – ఈ నేల , మెరిసే తారలదే రూపం లాంటి పాటలతో తెలుగు సినిమాలలో అతిపెద్ద మ్యూజికల్ హిట్స్ లో అగ్రస్థానంలో నిలబడింది. ఈ సినిమా తోనే సీతారామశాస్త్రి కాస్త సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారిపోయారు. కె.వి.మహదేవన్ మ్యూజిక్ అందించగా ఈ సినిమా ఏకంగా ఐదు నంది అవార్డులను సొంతం చేసుకుంది. దీంట్లో హీరోగా నటించచిన వారే సర్వదామన్ బెనర్జీ.

Sarvadaman D. Banerjee Height, Age, Wife, Children, Family, Biography &  More » StarsUnfolded
సర్వదామన్ చివరిగా 1987లో చిరంజీవి స్వయంకృషి సినిమాలో నటించారు. అది కూడా సెకండ్ హీరో పాత్ర.. ఇప్పుడు దాదాపు 35 సంవత్సరాల తర్వాత మళ్లీ గాడ్ ఫాదర్ లో చిరంజీవికి తండ్రిగా కనిపించారు. చిరంజీవి వయసు 67 సంవత్సరాలు.. అయితే సర్వదామన్ వయసు 57 సంవత్సరాలు. అయితే గాడ్ ఫాదర్ సినిమా విడుదలైన తర్వాత కూడా ఈయనను ఎవరు గుర్తించకపోవడం బాధాకరం.

Share post:

Latest