సూసైడ్ అటెంప్ట్ చేసిన కితకితలు ఫేమ్ గీతా సింగ్.. అంత కష్టం ఎందుకొచ్చిందంటే?

అల్లరి నరేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో కితకితలు మొదటి స్థానంలో ఉంటుంది. ఈ సినిమాలో కమెడియన్ గీతా సింగ్ అల్లరి నరేష్ భార్యగా నటించింది. ఆమె నటనకు మంచి గుర్తింపు కూడా దక్కింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ డ్రామా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో గీతా సింగ్‌కి మంచి పేరు మాత్రమే కాదు అనేక అవకాశాలు వచ్చాయి. ఎవడి గోల వాడిదే, సీమటపాకాయ్, కెవ్వుకేక, ఈడో రకం ఆడోరకం, తెనాలి రామకృష్ణ తదితర మూవీల్లో హాస్యనటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేసి అలరించింది. కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే గీతా సింగ్ ఒక్కసారిగా తెరమరుగైంది. ఎందుకు అలా జరిగింది?

ఈ బొద్దు గుమ్మ రీసెంట్‌గా ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన పర్సనల్ లైఫ్‌లో చోటు చేసుకున్న కొన్ని కంటి తడి పెట్టించే విషయాలు బయటపెట్టింది. ఇప్పుడు నటించాలని ఉన్నా ఇండస్ట్రీలో ఎవరూ కూడా ఒక్క ఆఫర్ ఇవ్వడం లేదని బాధగా చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో మేల్ ఆర్టిస్టుల డామినేషన్ అధికమని.. అందువల్ల లేడీ కమెడియన్స్ ఎక్కువగా రాణించలేకపోతున్నారనే చేదు నిజం బయటపెట్టింది.

ఇక పర్సనల్ లైఫ్‌లో మంచి విషయాల గురించి చెప్పి కంటతడి పెట్టుకుంది. తనని నమ్మిన నమ్మిన వారే దారుణంగా మోసం చేశారని.. తోడబుట్టిన వారు కూడా ధనాశ తోనే తనను వాడుకున్నారని చెబుతూ వాపోయింది. ఎంతో కష్టపడి నటించి సంపాదించుకున్న డబ్బంతా కూడా ఒకరిని నమ్మడం వల్ల పోగొట్టుకున్నారని ఆమె చాలా బాధ పడితే చెప్పింది. ఒక వ్యక్తి వద్ద చిట్టీలు వేసి రూ.6 కోట్ల వరకు తాను పోగొట్టుకున్నానని వివరించింది. డబ్బులు పోయాయనే బాధ తనని మానసికంగా ఎంతో బాధించిందని.. అదేసమయంలో సినిమా అవకాశాలు రాక చచ్చిపోవాలని అనిపించినట్లు చెప్పింది. ఈ సమయంలోనే రెండు సార్లు సూసైడ్ అట్టెంప్ట్ కూడా చేసినట్లు తెలిపింది. ఒక ఫ్రెండ్ సహాయంతో మళ్లీ తాను నార్మల్ అయిపోయానని చెప్పుకొచ్చింది.

Share post:

Latest