తన కెరీర్ కోసం.. వాళ్ళ అమ్మ కెరియర్ నాశనం చేసిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా..!?

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కృతి శెట్టి క్రేజ్‌ టాలీవుడ్లో అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత వరుస టాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారింది కృతి శెట్టి. ఉప్పెన‌ తర్వాత మరో మూడు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో కృతి శెట్టి టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కృతి శెట్టి ఫ్యామిలీ విషయాని కొస్తే ఆమె ముంబైలో పుట్టి పెరిగింది.. చదువుకునే సమయంలోనే కొన్ని కమర్షియల్ యాడ్స్ లో నటించింది. అ తర్వాత హిందీలో వచ్చిన సూపర్ 30 సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది.

ఆ సినిమా తర్వాత తెలుగు తెరకు ఈ ముద్దుగుమ్మ పరిచయమైంది. పరిచయమైనా తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది కృతి శెట్టి. ఆ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో సెటిలైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత శ్యామ్ సింఘా రాయ్- బంగార్రాజు వంటి సినిమాల్లో నటించి సూపర్ హిట్ అందుకుంది. అయితే కృతి హీరోయిన్ గా ఎద‌గ‌టం కోసం ఆమె కుటుంబ సభ్యులు ఎన్నో త్యాగాలు చేశారు.. అని ఈ వారి కృషివల్లే కృతి హీరోయిన్ అయిందని… ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. 2003లో పుట్టిన కృతి శెట్టి తులు కుటుంబానికి చెందిన అమ్మాయి. వీరిది కర్ణాటకలోని మంగుళూర్ ప్రాంతం కృతి శెట్టి తండ్రి బిజినెస్ వ్యవహారాల కోసం ముంబైలో సెటిల్ అయ్యాడు. ఆమె తల్లి ఒక ఫ్యాషన్ డిజైనర్ కృతి శెట్టి కి చెల్లి తమ్ముడు కూడా ఉన్నారు.

 Krithi Shetty About Her Mother Sacrifice Krithi Shetty , Tollywood, Uppena, Mang-TeluguStop.com

కృతి శెట్టి తన చిన్నతనం మొత్తం ముంబైలోనే పెరిగింది. కృతి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ క్రమంలోనే కృతి శెట్టి హీరోయిన్గా సక్సెస్ అవ్వడం కోసం ఆమె తల్లి కొన్ని త్యాగాలు చేసిందట. కృతి శెట్టి కి వరుస అవకాశాలు రావడంతో కృతి శెట్టి కోసం ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తున్న జాబ్ ని కూడా వదిలేసిందట. కృతి శెట్టి ఎక్కడికి వెళ్లినా తనతో ఆమె తల్లిని తీసుకువెళ్తుంది. అలా కృతి శెట్టి తల్లి తన అమ్మాయి కెరియర్‌ సక్సెస్ అవ్వటం కోసం తన జాబ్‌ను సైతం వదిలేసింది. తాజాగా జ‌రిగిన ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇక కృతి శెట్టి తెలుగులో స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది. ఈ సంవత్సరం కృతి శెట్టి మూడు సినిమాలుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.